Samantha | సమంత వేసుకున్న డ్రెస్ రేటు విని షాక్ అవుతున్న జనాలు

Samantha | హీరోయిన్స్, సెలబ్రిటీలు వేసిన డ్రెస్ మరలా వేయరు. ఎప్పటికప్పుడు మార్చేస్తారు. సెలబ్రిటీగా ఉండటం చిన్న విషయం కాదు. మైంటైసెన్సె కి లక్షల్లో ఖర్చవుతుంది. హీరోయిన్ సమంత బ్రేక్ లో ఉన్నారు. ఇటీవల సమంత లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. విరామం దొరికిన నేపథ్యంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. విహారాలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తున్నారు.

మిత్రులు, సన్నిహితులతో ఇండోనేషియా వెళ్లిన సమంత బాలీ ద్వీపంలో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. దీవుల దేశంలో ప్రకృతి మధ్య గడుపుతున్నారు. ఏడాది పాటు సమంత సినిమాలు చేయరంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయాన్ని ఆమె చికిత్స కోసం, విశ్రాంతి కొరకు ఉపయోగించనున్నారట.ఇక సామ్ న్యూలుక్ బ్యూటీఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

ఇంకేముంది సమంత ధరించిన ఆ లేటేస్ట్ డ్రెస్ ధర గురించి నెట్టింట సెర్చింగ్ జరుగుతుంది. అద్భుతమైన ఎంబ్రాయిడరీ కార్పెట్, ప్యాంట్, కోట్ ధరించిన ఆ డ్రెస్ విలువ రూ.2.95 లక్షలు. సామ్ డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.రీతూ కుమార్ డిజైన్ చేసిన దుస్తులలో బంగారు తార్ వర్క్, నారింజ, ఆకుపచ్చ, మెరూన్ లో సీక్విన్ అలంకారాలతో కలర్ ఫుల్ కార్సెట్ కనిపిస్తుంది.

ఆలాగే స్ట్రాప్లెస్ బ్లౌజ్, డేరింగ్ ప్లంగింగ్ నెక్ లైన్, బాడీ హగ్గింగ్ సిల్హౌట్ ను కలిగి ఉంటుంది. రిచ్ బ్రౌన్ ప్యాటర్న్ లలో హై వెయిస్ట్ ఫ్లేర్డ్ ట్రౌజర్ లలో సరిపోతుంది. ఈ అందమైన దుస్తులకు సరిపోయేంతగా.. ఆమె స్పైరల్ మెటాలిక్ వాచ్, రత్నాలు పొదిగిన లాకెట్టు నెక్లెస్, ఇయర్ స్టడ్స్, ఆక్సిడైజ్డ్ సిల్వర్ రింగ్, ట్రెండీ లెన్నాన్, లేతరంగు గల సన్ గ్లాసెస్ ధరించి మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యాంది. దీంతో ఆమె 41వ ఇండిపెండెన్స్ పరేడ్ వేడుకలో అందరి చూపును ఆకర్షించింది.

Leave a Reply