Bigg Boss7 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో షకీలా..! ఇంకా మామూలుగా ఉండదుగా..

Bigg Boss Telugu 7 | బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి షో ప్రారంభం కానుంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవడంతో సీజన్ 7ను గ్రాండ్ సక్సెస్ చేయాలని టీం భావిస్తోంది. ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్తో ఈసారి షో కొత్తగా ఉంటుందంటూ ప్రేక్షుకల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రోమోలు కొంత బజ్ క్రియేట్ చేశాయి.మై విలేజ్ షో తో సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులన్నీ తన సొంతం చేసుకున్న అనిల్.

పలు సినిమాల్లో సైతం నటిస్తున్నాడు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక యూట్యూబ్ కేటగిరీలో అనిల్ ఎంట్రీ పక్కా అని చాలామంది అంటున్నారు. దాంతో పాటు రైతు బిడ్డను సైతం బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక గతంలో జబర్దస్త్ అదిరే అభి టీం లో పనిచేసిన యూట్యూబ్ టేస్టీ తేజకు సైతం ఎందుకు ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు కార్తీకదీపం ఫెమ్ శోభిత శెట్టి సైతం ఈ సీజన్లో కనిపించబోతుందని అంటున్నారు.సీరియల్లో మోనిత పాత్రతో మెప్పించిన ఈమె సీజన్ సెవెన్ కి రాబోతుందట. జబర్దస్త్ నరేష్ కి సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ నేపద్యంలోని నరేష్ ఎంట్రీ పై పలు అనుమానాలు నెలకొన్నాయి. అతని ప్లేస్ లో రింగ్ రియాజ్ తో ప్లేస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు అని అంటున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లోకి షకీల కూడా రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం కూడా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ షకీలా ఇందుకు ఒప్పుకుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply