Couples | మీ భాగస్వామి పక్కన నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

Sleeping Together

Couples | నిద్ర అనేది మనిషి చాలా ముఖ్యం. నిద్రరాకుండా ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటికీ ఒకటే మందు మీ భాగస్వామి.జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనస్సుకు ఒక రిలాక్సింగ్ అనుభవం. భాగస్వామి మన పక్కన ఉన్నప్పుడు,

Sleeping Together
Sleeping Together

శరీరం(Body), మనస్సులో ఉత్సాహంగా ఉంటుంది. వారితో గడిపిన ప్రతి క్షణం సంతోషకరమైన క్షణమే. కొన్ని అధ్యయనాల ప్రకారం, భాగస్వామి పక్కన నిద్రపోతే.. లోతైన నిద్ర వస్తుంది. లేదంటే అభద్రతాభావం, భయంతో నిద్రకు భంగం కలుగుతుందట. ఇదొక్కటే కాదు.. భాగస్వామి పక్కన పడుకుంటే మరెన్నో లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మ్యూచువల్ స్లీపింగ్ ప్యాటర్న్


జీవిత భాగస్వామితో కలిసి పడుకోవడం వల్ల ఇద్దరూ ఒకే సమయానికి నిద్రపోతారు. నిద్ర దినచర్య సరిగా ఉంటుంది. నిద్ర చక్రాల వల్ల కలిగే ఆటంకాలని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. భాగస్వాములు ఇద్దరూ ఒకే నిద్ర షెడ్యూల్ కలిగి ఉండటం వల్ల నిద్రపోవడం, మేల్కోవడం సులభం అవుతుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం

భాగస్వామి శారీరక ఉనికి మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా శారీరక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జీవిత భాగస్వామితో బెడ్ షేర్ చేసుకున్నప్పుడు శారీరక ఒత్తిడి పెరగడం సహజం. ఇది ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ప్రశాంతమైన, హాయైన నిద్రని ఇస్తాయి.

ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి సరైన ఏకాంత సమయం ఇదే. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపొచ్చాలకు, భేధాభిప్రాయాలకు చోటు ఉండదు. జీవితం సాఫీగా ఎటువంటి గొడవలు లేకుండా సాగిపోతుంది.

Leave a Reply