Manchu Manoj | జగన్ కి బిగ్ షాక్.. టీడీపీలోకి మంచు మనోజ్…! పోటీ ఎక్కడి నుడి అంటే..?

Manchu Manoj | మంచు మనోజ్ భార్య మౌనిక.. దివంగత టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె అన్న విషయం తెలిసిందే. మౌనిక సోదరి భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు, మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు వైసీపీకి మద్దతుదారుడుగా ఉన్నారు. ఆయన సోదరుడు విష్ణు భార్య విరానికా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు.

ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మంచు మనోజ్ దంపతులు కలిశారు. చంద్రబాబు నివాసం బ్యాక్ గేట్ లోంచి మంచు మనోజ్ దంపతులు…ఆయన ఇంటికి వెళ్లారు.

వివాహం అయ్యాక మొదటిసారి చంద్రబాబు కలవడానికి మంచు మనోజ్ దంపతులు వచ్చారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చామని వెల్లడించారు.మా భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు.

2019 ఎన్నికల సమయంలోనే మంచు మనోజ్ (Manchu Manoj ) రాజకీయ ఆరంగ్రేటం గురించి చర్చ జరిగింది. ఆ సమయంలో మంచు ఫ్యామిలీ వైసీపీకి దగ్గరగా ఉంది. చిత్తూరు జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రెండు నియోజకవర్గాల్లో మనోజ్ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. అదీ అలానే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడంతో.. టీడీపీలో చేరిక లాంఛనమే కానుంది.

Leave a Reply