Laxmi Puja Tips | ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే వీటిని పాటించాల్సిందే..!

Laxmi Puja Tips | జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలా మంది అంటుంటారు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన వాటిలో డబ్బు ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు, ఆందోళనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు మన దగ్గర లేకపోయినట్లయితే కొన్ని సార్లు సొంత వాళ్లు కూడా మనకు దూరంగా ఉంటారు. అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండటానికి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి.

అంటే లక్ష్మీ దేవి ఎప్పుడూ మీ ఇంటే ఉండాలి.ఈ వస్తువులను కనుక మీరు పూజ గదిలో పెట్టినట్లయితే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.అది ఏమిటో ఇప్పుడు చూడండి. పూజ గదిలో గంటని పెట్టినట్లయితే దుష్టశక్తులు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు ఉండవు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పూజ గదిలో నెమలి ఈకని పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది.ఆర్థికంగా కూడా దృఢంగా ఉండచ్చు. ఆర్థిక బాధలు ఏమీ కూడా ఉండవు. కాబట్టి నెమలి ఈకని కూడా పూజ గదిలో పెట్టుకోండి.

దీపం లేకపోతే పూజ అసంపూర్ణం. పూజ గదిలో దీపాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. పూజ గదిలో దీపాన్ని పెట్టినప్పుడు పడమర వైపు పెట్టండి. అలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.పూజ గదిలో శంఖాన్ని పెడితే కూడా సిరిసంపదలు కలుగుతాయి. పూజ గదిలో నీళ్లు నింపిన కలశాన్ని పెడితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు. గంగాజలాన్ని పూజ గదిలో పెడితే కూడా చాలా మంచి కలుగుతుంది. పూజగదిలో ఇత్తడి లేదంటే వెండి పాత్రలో గంగాజలం పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఇలా వీటిని పూజ గదిలో పెట్టినట్లయితే ఆర్థిక బాధలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

Leave a Reply