Nara Brahmani | లోకేష్, ఎన్టీఆర్, బ్రాహ్మణి టిడిపికి ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరు..?

Nara Brahmani

Nara Brahmani | ఒక్క చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోవటం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం టీడీపీ లీగల్ టీం అదేవిధంగా నారా లోకేష్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో గత కొద్ది రోజుల నుండి లోకేష్ భార్య నారా బ్రాహ్మణి రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉంటూ ఉన్నారు.

లోకేష్ కంటే కూడా చాలా బాగా మాట్లాడుతూ నిరసన కార్యక్రమాలలో హోరెత్తిస్తున్నారు.కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు విషయంలో జరిగిన అన్యాయం సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో… వివరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ చంద్రబాబుకి బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బలమైన కుటుంబ నేపథ్యం తో పాటు.. మాట్లాడే సత్తా ఉండటంతో చంద్రబాబు కూర్చోవాల్సిన కుర్చీలో నారా బ్రాహ్మణి నీ కూర్చోబెట్టడానికి..

Nara Brahmani
Nara Brahmani

ఎల్లో మీడియా అధినేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. లేడీస్ సెంటిమెంట్ రాజకీయాలలో బాగా పనిచేస్తుందని ఈ రకంగా ఎన్నికలలోకి వెళ్ళటానికి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలుతో… మద్దతు మీడియా ఎల్లో మీడియా అధినేతలు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అలాగే కొంత మంది మాత్రం తారక్ లేదా బాలయ్యకి ఇస్తే బాగుటుంది అంటున్నారు..

ఇది చదవండి: వామ్మో.. మేకప్ లేకుండా కాజల్ ఇంత దారుణంగా ఉంటుందా..?

ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది అనే చెప్పాలి.. మరో పక్క ఇప్పటికే ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలు జరిగాయి అని సిఐడి విచారణలో తేల్చింది.ఇప్పటికి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.వారు ప్రస్తుతం వారికి బెయిల్ వచ్చింది.దీంతో ఇక ఈ కేసు సంగతి పక్కన పెట్టేశారు అనుకుంటూ ఉండగానే, మరోసారి దర్యాప్తును ఉదృతం చేయాలని భావిస్తుండడంతో, ఆ కేసులో లోకేష్ కనుక అరెస్ట్ అయితే బ్రాహ్మణి రంగంలోకి దిగే అవకాశం ఉండబోతోంది.

ఇది చదవండి: ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే వీటిని పాటించాల్సిందే..!

Leave a Reply