Vijay Antony | కోట్ల ఆస్తి ఉండి.. చదువుకోసం నువ్వు చనిపోవడం ఏంటి.. విజ‌య్ ఆంటోని కన్నీరు.

Vijay Antony |నటుడు ‘విజయ్‌ ఆంటోని’. మోన్న (సెప్టెంబర్ 19) ఈ హీరో ఇంట తీవ్ర విషాదం జరిగిన సంఘటన అందరికి తెలిసిందే. 16 ఏళ్ళ వయసున్న విజయ్ ఆంటోని కూతురు మీరా.. మంగళవారం తెల్లవారుజామున ఆళ్వార్‌పేటలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఉదయం మూడు గంటల సమయంలో మీరా తన గదిలో ఉరి వేసుకుని కనిపించడంతో ఆమెను వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొనడంతో విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది.ఇది ఇలా ఉంటే, గతంలో విజయ్ ఆంటోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ఆంటోనీ కూతురు మాత్రమే కాదు అతని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొనే మరణించారట. విజయ్ ఆంటోని తండ్రి మద్యానికి బానిసవ్వడంతో..

ఒక సమయంలో బాగా ఎమోషనల్ అయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు విజయ్ పేర్కొన్నాడు.దీంతో విజయ్ తన 7 ఏళ్ళ వయసు నుంచే తండ్రి లేకుండా పెరిగాడు. ఇక ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఆత్మహత్య చేసుకునే మరణించడం బాధాకర విషయం. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అది చూసిన నెటిజెన్స్ కూడా బాధ పడుతున్నారు.

ఇది చదవండి: వామ్మో.. మేకప్ లేకుండా కాజల్ ఇంత దారుణంగా ఉంటుందా..?

కాగా విజయ్‌ ఆంటోని కూతురు చనిపోవడానికి గల కారణం చదువులో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌ కారణంగానే.. విజయ్‌ ఆంటోని కుమార్తె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్‌ చదివే బాలిక మీద అంత ఒత్తిడి ఏంటి.. మీరా కేవలం చదువు పరంగానే ఒత్తిడి ఎదుర్కొంటుందా.. లేక వేరే ఇతర సమస్యలతో బాధపడుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. విజ‌య్ ఆంటోని కూతురి మ‌ర‌ణంపై మాట్లాడుతూ ఇలా చెయ్యడం తప్పు చదువు కోసం ప్రాణాలు పోగ్గొట్టుకోవడం ఏంటి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

Leave a Reply