Gold rate | మార్కెట్లో నేటి బంగారం ధరలు..!

Gold rate today

Gold rate | దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 పెరిగి.. రూ. 55,450కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3,000 పెరిగి, రూ. 5,54,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,545గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,640గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,450గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.

దేశంలో వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,840గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,000 పెరిగి 78,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 77,400గా ఉండేది.

Leave a Reply