Sri Rama Navami | నిజంగా గ్రేట్ .. దర్గాలో సీతారాముల కల్యాణం.. ఎక్కడంటే..?

Sri Rama Navami | శ్రీ రామనవమి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రిలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదర్శమూర్తులైన శ్రీ సీతారాముల కళ్యాణం కనులారా చూసిన భక్తజనం పులకరించిపోయారు. అలవైకుంఠం ఇలకు దిగివచిందన్నట్లుగా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. అందంగా అలంకరించబడ్డ కళ్యాణ వేదికలో వేద పండితుల మంత్రోత్చరణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాలతో కళ్యాణం వైభవంగా జరిగింది.

పెళ్లి వేదికపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శ్రీ సీత రామచంద్రమూర్తి భక్తులకు దర్శన మిచ్చారు.అయితే పలుచోట్ల మత సామరస్యం వెల్లివిరిసింది. తెలంగాణలో ముస్లింలు సీతరాముల కల్యాణం జరిపించడం విశేషం. అది కూడా అక్కడా ఇక్కడా కాదు వారి దర్గాలోనే సీతారాముల వివాహం జరిపించి మత సామరస్యాన్ని చాటి చెప్పారు.కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల సత్యనారాయణపురంలో శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి.

Sri Rama Navami

గ్రామంలోని హజ్రత్‌ నాగుల్‌ మీరా మౌలచాన్‌ దర్గా షరీఫ్‌లో ముస్లింలు శ్రీరామనవమి వేడుకలు జరిపారు. మతాలకతీతంగా హిందూ ముస్లిం ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ వేడుకల కోసం దర్గాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వారం రోజుల ముందు నుంచే వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక నవమి రోజు బుధవారం సీతా రాముల కల్యాణాన్ని హిందూవులతోపాటు ముస్లింలు పాల్గొని జరిపించారు.

Recent Posts

Leave a Reply