Govt Jobs | నిరుద్యోగులకు అలర్ట్.. పది పాసైతే చాలు రైల్వేలో ఉద్యోగం.

allroudadda

Govt Jobs | మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. మీరు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.

పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ చూడండి.

allroudadda
allroudadda

ముఖ్యమైన సమాచారం:
యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య:
550
ట్రేడుల వారీగా ఖాళీలు:
ఫిట్టర్:
200
వెల్డర్(జీ&ఈ):
230
మెషినిస్ట్:
05
పెయింటర్(జీ):
20
కార్పెంటర్:
05
ఎలక్ట్రీషియన్:
75
ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్:
15

allroudadda
allroudadda

అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం(10+2 పరీక్షా విధానం కింద), సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
31.03.2024 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌ లైన్
ఎంపిక విధానం:
పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ:
09-04-2024

Leave a Reply