Note | రూపాయి నోటు మీ వద్ద ఉందా… అయితే మీరు కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే.

Old Notes | ఈ మధ్య కాలంలో పాత నోట్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. పాత కాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. అయితే కొందరిలో పాత కాలపు నోట్లు, పాత కాలపు నాణేలు జమ చేస్తుంటారు. అలాంటి వారు ఓ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు. ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాతనోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది.

అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా.. రూ. 45 వేలు. కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు.. పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్‌ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు. అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు.అయితే ప్రస్తుతం పాత నోట్లు ప్రస్తుతం దేశంలో చెలామణిలో లేవు.

కానీ వాటిని ఆన్‌లైన్ కేంద్రాలలో వేలకు వేలు విక్రయిస్తున్నారు. ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బి.సి. రామారావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటును coinbazzar.comలో 16,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. 1957 లో గవర్నర్ హెచ్‌ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట 45 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ నోట్ యొక్క సిరీస్ 123456 గా ఉంది.

అలాగే ఎస్.కె. వెంకటరమణ సంతకం చేసిన 500 రూపాయల పాత నోటు ఆన్‌లైన్‌లో 1.55 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ నోట్స్ క్రమసంఖ్య 1616 తో మొదలవుతుంది. అలాగే 701420 సీరియల్‌ నెంబర్‌తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్‌లైన్‌లో 10,500 రూపాయలకు అమ్ముడవుతోంది. అంతేకాదు.. ఎరుపు రంగులో ముద్రించిన 10 రూపాయల నోటును ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో 20 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీని క్రమ సంఖ్య 155863 గా ఉంది.

అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం.. వెబ్‌సైట్‌ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకాన్ని ప్రచారం చేస్తోంది. అయితే పాత నాణేలను, నోట్లను జమ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కొంత మంది ఆంగ్ల కాలం నాటి నోట్లు, నాణేలను జమ చేస్తుంటారు. కొంత మంది స్వాతంత్ర్య కాలం నాటి ఈ పాత నోట్లను, నాణేలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే సాధారణంగా వీటికోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకు వస్తుంటారు. అందుకే కాయిన్‌బజార్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇలాంటి పాత నోట్లు, పాత నాణేలను పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

Leave a Reply