Renu Desai | సముద్రపు ఒడ్డున రేణు దేశాయ్ రచ్చ.. ఆ అందాలు కూడా

Renu Desai | రేణు దేశాయ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె సాగరతీరంలో జలకాలాడారు. రేణు దేశాయ్ లోని ఈ ఊహించని యాంగిల్ అభిమానులకు సరికొత్తగా తోచింది. బద్రి మూవీతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రేణు దేశాయ్ వివాహం అనంతరం యాక్టింగ్ మానేశారు. బద్రితో పాటు రేణు ఓ తమిళ చిత్రం చేశారంతే. రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు మూవీ నుండి రేణు దేశాయ్ లుక్ విడుదల చేశారు. తెల్ల చీరలో నిరాడంబరంగా రేణు లుక్ ఆసక్తి కలిగించింది.

Renu Desai Enjoying
Renu Desai Enjoying

అది పక్కన పెడితే ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో రేణు దేశాయ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. ఖాళీ సమయం దొరికితే రేణు దేశాయ్ నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తారు. సమ్మర్ వెకేషన్ లో భాగంగా రేణు దేశాయ్ సాగర తీరానికి వెళ్లారు.సముద్ర అలల మధ్య జలకాలాడుతున్న ఆమె వీడియో వైరల్ అవుతుంది.

Renu Desai Enjoying
Renu Desai Enjoying

నేను సముద్ర అలల ధాటికి అల్లాడిపోతుంటే రూత్ లెస్ పాపరాజి(ఆద్య) వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తుందని… ఆ వీడియోకి రేణు దేశాయ్ కామెంట్ జోడించారు. రేణు దేశాయ్ వీడియో వైరల్ గా మారింది. గతంలో రేణు దేశాయ్ ని ఇలా చూడని ఆమె అభిమానులు డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి,

Renu Desai Enjoying
Renu Desai Enjoying

Leave a Reply