Kamal Haasan | బిగ్ బాస్ 7కు రికార్డు స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న క‌మ‌ల్ హాస‌న్‌..!ఎన్ని కోట్లు అంటే,

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షోస్‌లో బిగ్ బాస్‌(Bigg Boss) ఒక‌టి. ఇండియాలో బిగ్ బాస్ అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. త‌మిళంలోనూ ఈ షో స‌క్సెస్ ఫుల్ గా న‌డుస్తోంది. ఇప్ప‌టికే కోలీవుడ్ లో క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ గా బిగ్ బాస్ ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 7 ప్రారంభం కాబోతోంది. అయితే తెలుగులో మాదిరిగానే త‌మిళంలో కూడా గ‌త రెండు సీజన్స్ ఆశించిన స్థాయిలో టీఆర్పీని అందుకోలేక‌పోయాయి.

దీంతో బిగ్ బాస్ సీజ‌న్ 7(Bigg Boss 7)ను చాలా కొత్త‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే వ‌ర‌కు ఒక‌టే హైస్‌.. ఒకటే షో అన్న‌ట్లు బిగ్ బాస్ న‌డిచింది. కానీ ఈసారి మాత్రం మేక‌ర్స్ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఒకే షోలో రెండు బిగ్ బాస్ హౌస్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ కమల్ హాసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎప్పుడూ అదే ఇల్లు, అంతే మంది కంటెస్టెంట్లు, అదే కన్ఫెషన్ రూమ్, అవే గేమ్స్ కాకుండా.. సీజ‌న్ 7ను చాలా థ్రిల్లింగ్ గా డిజైన్ చేశార‌ట‌. దీంతో లేటెస్ట్ సీజ‌న్ పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ 24న త‌మిళ బిగ్ బాస్(Bigg Boss Tamil) ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌బోతోంది. కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొంద‌రు పేర్లు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇక‌పోతే బిగ్ బాస్ 7కు హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్ రికార్డు స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.కమల్ హాసన్ ఏకంగా 130 కోట్ల రూపాయల పారితోషికం పొందనున్నారని టాక్.మరి ఇదే నిజమైతే కమల్ సినిమాకు మించి రెమ్యునరేషన్ ఈ రియాలిటీ షోకు అందుకోనున్నారు అని తెలుస్తుంది.

Leave a Reply