Chandrayaan-3 | చంద్రయాన్ 3 మిషన్ ప్రోగ్రాం రాసింది మన తెలుగు కుర్రాడే ..!

భారత్‌ చేపట్టిన మూడో మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతం కావడంతోపాటు చరిత్ర సృష్టించింది. గత బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో మూన్‌ సౌత్‌ పోల్‌పై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ చరిత్రలోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో భారత్‌ చేపట్టిన మూన్‌ మిషన్‌కు సంబంధించిన అనేక అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.కాగా, జూలై 14న మధ్యాహ్నం 2.30 గంటలకు లాంచ్ వెహికల్ మార్క్-III రాకెట్‌ ద్వారా శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-3ని నింగిలోకి ఇస్రో పంపింది.

అతిపెద్ద బరువైన ఈ రాకెట్‌ ప్రధానంగా ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్‌ అనే మూడు మాడ్యూళ్లను కలిగి ఉన్నది. రాకెట్ మొదటి దశ ఘన ఇంధనంతో, రెండవ దశ ద్రవ ఇంధనంతో, చివరి దశలో ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్‌తో నడిచే క్రయోజెనిక్ ఇంజిన్లున్నాయి.మరోవైపు జూలై 14న చంద్రయాన్‌-3 లాంచ్‌ సందర్భంగా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను 1,696.4 కిలోల ఇంధనంతో నింపారు. ఇది భూ కక్ష్యలోకి చేరిన తర్వాత ఇస్రో ఐదు విన్యాసాలు చేపట్టింది.

అనంతరం చంద్రయాన్‌-3 చంద్రుడి దిశగా ప్రయాణించినప్పుడు జూలై 15, ఆగస్ట్‌ 17 మధ్య మరో ఐదు విన్యాసాలను ఇస్రో నిర్వహించింది. అది పక్కన పెడితే మిషన్లో జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ మిషన్ లో టూ పిలౌట్స్ ఉన్నాయి. అంటే LHBC , ILSA ఉన్నాయి. వీటికి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాశారు కృష్ణ. ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి మద్దిలేటి సంతానమే ఈ కృష్ణ కుమార్. 2008లో పదవ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు తిరుపతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ఈసెట్ రాసి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ లో చేరారు.

సిఎస్సిలో చేరారు. కాలేజీలో DRDO లో మూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఇస్రో లో సంబంధించిన పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించారు. తరువాత చంద్రయాన్ 3 మిషన్ కి మూడు నెలల పాటు పనిచేశారు. చంద్రయాన్ లో అనేక కేంద్రాలు పనిచేసాయి. మిషన్ టు పిలౌట్స్ లో ఐదు మంది సభ్యులు పనిచేసిన వీటిలో ఐఎల్ బిసి, హెచ్ఎస్ బిసి కి డేటా ఎనాలసిస్ సాఫ్ట్వేర్ రాశారు. ఎల్ హెచ్ బిసి అంటే హారిజంటల్ వెలాసిటీ అలాగే ఐఎల్ఎస్ఏ అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలను గుర్తించి రికార్డ్ చేస్తుందని గుర్తించారు కృష్ణ. ఈ సాఫ్ట్వేర్ పిల్లౌట్స్ నుంచి వచ్చే డేటాను ISRDC బెంగుళూరు అందుకుంటుంది. కృష్ణ మల్టీ టాలెంటెడ్ కూడా.

https://youtu.be/dvkAK5cZt98

Leave a Reply