Tollywood | ఏ కులం హీరో టాలీవుడ్ లో నెంబర్ వన్.. కమ్మ, కాపు, క్షత్రియ..?

Tollywood | సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోను టాప్ ప్లేస్ కోసం స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటారు.అయితే ఇండస్ట్రీలో ఎప్పటికీ ఓకే హీరోనే టాప్ హీరోగా ఉంటారు అనుకోవడం పొరపాటే అని చెప్పవచ్చు.ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు హీరోల కెరిర్ డౌన్ అయినప్పుడు మరొక హీరో నెంబర్ వన్ హీరోగా మారుతూ ఉంటారు.పాన్ ఇండియా సినిమాల హడావిడి లేక ముందు టాలీవుడ్ నెంబర్ 1 రేసులో రామారావు నాగేశ్వరావు పోటీ పడ్డారు.

తరువాత శోభన్ బాబు లాంటి వాళ్లు వచ్చి సినిమా ఇండస్ట్రీకి మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ఎన్టీఆర్ వరుసగా చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా రావడం, ముఖ్యమంత్రి అవడం తెలుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ, రాజకీయ రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. కొన్నాళ్లు కృష్ణ కూడా సినీ ఇండస్ట్రీని ఏలారు.

ఆ తర్వాత చిరంజీవి అరంగేట్రం చేశారు. ఇండస్ట్రీని చాలా ఏళ్ల పాటు ఏలారు.ఒకానొక సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలారు. అదే సమయంలో చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవికి డ్యాన్స్ ప్లస్ పాయింట్ కావడంతో కృష్ణను దాటుకొని వెళ్లి ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నిలిచారు.ఆ తర్వాత తరంలో ఎవరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ అవుతారు అని అంతా ఎదురు చూశారు.

పవన్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలామంది కుర్ర హీరోలు వచ్చినా ఎవ్వరూ అంతగా టాప్ పొజిషన్ ను అందుకోలేకపోయారు. ఒక్కోసారి ఒక్కో హీరో టాప్ లో ఉండేవారు. ఆ తర్వాత మరో హీరో. ఇలా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ మారుతూ ఉండేది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు టాప్ పొజిషన్ లో ఉన్న హీరో రవితేజ. ఇక.. రవితేజ తర్వాత ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారో వేచి చూడాల్సిందే.

Leave a Reply