Anasuya Bharadwaj | రహస్యాన్ని బయట పెట్టిన అనసూయ.. ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ నుండి వచ్చేశా..

Anasuya Bharadwaj | ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. బుల్లితెర ప్రేక్షకులకు ‘జబర్దస్త్’ (Jabardasth) షో ఇచ్చిన కిక్ అయితే మరే ఇతర షో ఇవ్వలేదనేది తప్పక ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ షోకి బ్యాడ్ టైం నడుస్తుంది.. వలసలు ప్రవాహంతో జబర్దస్త్‌లో వినోదం మసకబారుతోంది.జబర్దస్త్ జడ్జీలుగా ఏళ్లకు ఏళ్లు ఆ కుర్చీలకు అతుక్కుని లెక్కలేనన్న కామెడీ పంచ్‌లను అందించి వినోదాన్ని పంచిన నాగబాబు ముందే జబర్దస్త్‌ని వీడగా.. రీసెంట్‌గా ఏపీ కేబినేట్‌లో మంత్రి పదవి అందుకున్న రోజా కూడా జబర్దస్త్‌కి టాటా బై బై చెప్పేశారు.ఆ తరువాత టాటాలు చెప్పేవారు ఒక్కొక్కరుగా పెరుగుతూ వస్తున్నారు.

చిన్నా చితకా జబర్దస్త్ కమెడియన్లు వస్తుంటారు వెళ్తుంటారు కానీ.. ఈ కామెడీ షోలో ఏళ్లకి ఏళ్తు పాతుకుని పోయిన.. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది, అదిరే అభి, చమ్మక్ చంద్ర ఇలా టీం లీడర్లు అంతా వరుసగా క్యూ కట్టడంతో ‘జబర్దస్త్’లో వినోదం పాళ్లు తగ్గాయి. ఆ ప్రభావం రేటింగ్‌పై పడటంతో.. ఒకప్పుడు టాప్ రేటింగ్‌లో ఉన్న జబర్దస్త్ ఊహించని రీతిలో పతనం అయ్యింఈ మధ్యే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అక్కడ ఉన్నంత వరకు ఆ షో గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయని అనసూయ బయటకు వచ్చాక తన బాడీ గురించి చాలాసార్లు స్కిట్స్ లో అవహేళన చేశారని చెప్పింది.అయితే ఇప్పుడు తాజాగా అనసూయ మరో కొత్త పాట పాడుతోంది. తాను జబర్దస్త్ వీడటానికి ఇన్నాళ్లూ ఏవేవో కారణాలు చెప్పిన ఈ భామ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది.

ఆ ఇద్దరి వల్లే షో మానేశానని చెబుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు ఆమె కొడుకులేనట. అనసూయ తన పిల్లలతో గడపడానికి సమయం దొరకడం లేదనే ఉద్దేశంతోనే జబర్దస్త్ మానేశానని చెప్పుకొచ్చింది. ఓ వైపు సినిమాల షూటింగ్స్.. మరోవైపు జబర్దస్త్.. ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని.. అందుకే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశానని చెప్పింది. అయితే ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు చాలా మంచి కెరీర్ ఇచ్చిందని..

ఇప్పుడు సినిమాల్లో బిజీ అవడం వల్ల జబర్దస్త్ చేయడం కుదరకపోవడం కాస్త బాధగానే ఉందని అంటోంది.మొత్తానికి అప్పుడేమో బాడీ షేమింగ్ అంటూ హాట్ కామెంట్స్ చేసి.. ఇప్పుడు పిల్లల కోసమే జబర్దస్త్ వదిలేశానని అనసూయ మాట మార్చడం వెనక ఉన్న మర్మమేంటోనని నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అనసూయ కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యింది. అయితే ఇటీవ‌లే ఒక ఇంట‌ర్వ్యూలో అన‌సూయ 16 ఏళ్ల‌కే డేటింగ్ చేసిన‌ట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇటీవ‌లే ఒక ఇంట‌ర్వ్యూలో అన‌సూయ 16 ఏళ్ల‌కే ప్రేమలో పడిన‌ట్లు చెప్పుకొచ్చింది.ది.

Leave a Reply