Sravana Masam | శ్రావణ మాసంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కోట్లు కురిపిస్తుంది..!!

Sravana Masam | తెలుగు సంవత్సరంలో ఐదవ మాసం శ్రావణమాసం.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే.. ఈ మాసం సకల దేవతలకు ఇష్టమైనది.. కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరుడు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం.. మాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆవుపేడతో కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి.. ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.. ఇంటి ముందు గల తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేయాలి..

తరువాత స్త్రీలు, ఇంట్లో వారందరూ శుచిగా స్నానమాచరించాలి. కాళ్లకు చక్కగా పసుపు రాసుకుని, నుదుటన కుంకుమ ధరించాలి. ఇప్పుడు దేవుడికి సమర్పించే వలసిన ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలి. తెలుపు, ఎర్రటి పూలతో దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో లో గుగ్గిలం, సాంబ్రాణి తో దూపం వేసుకోవాలి. ఇల్లు సువాసన భరితంగా ఉండాలి. ఆడవారి నుదుటిన కుంకుమ బొట్టు, చేతికి నిండుగా గాజులు, కాళ్ళకి పసుపు, మెట్టెలు ధరించి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది..

శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం రెండుపూటలా దీపారాధన చేయాలి. ఈనెలలో ఆడవారు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు పొడిస్తే మీ అదృష్టం, సంతోషాన్ని ఊడ్చిన్నట్టు లెక్క.. అందుకని సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే ఇల్లు ఊడ్చూకోవలి. సాయంత్రం సంధ్యా సమయంలో తులసికోటలో నీళ్లు పోయకూడదు. తులసి కోట ముందు నెయ్యి దీపం మాత్రమే వెలిగించాలి.

అలాగే ఇంట్లో తల దువ్వ కూడదు. ఈ మాసంలో మెట్టెలు, నల్లపూసలు తీయకూడదు.. ఎవరైతే ఇంటిని శుభ్రంగా చేసుకోవాలని ఉంటారో ఆడవారు ఈ నియమాలు అన్నింటినీ పాటిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.ఈ మాసంలో పాలు, పాల పదార్థాలను దానం చేస్తే సకలభీష్టాలు నెరవేరుతాయి. ఈ నెలలో అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే గోవులకు పచ్చగడ్డిని తినిపిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.

ఈ మాసంలో వంకాయ కూర తినకూడదని చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం, ఈ మాసంలో వంకాయ తినడం అశుద్ధమని భావిస్తారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజుల్లో అసలు వంకాయ తినకూడదు. ఈ నెలలో మాంసాహారం, మందు తాగ కూడదు. ఈ మాసంలో ప్రతి రోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. నెలసరి సమయంలో పూజ గది వైపు వెళ్ళకూడదు. ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులను తాకకూడదు..

Leave a Reply