Actress Kiara Advani | కియారా అద్వానీ తల్లి కాబోతుందా? అక్కడ గుసగుసలు !

Actress Kiara Advani

Actress Kiara Advani | కియారా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఘనంగా వివాహం చేసుకుంది. జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇటీవలే వెకేషన్‌ పూర్తి చేసుకుని వచ్చిన ఈ జంట ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు ఫుల్‌ బిజీగా ఉంటున్నారు.మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న సత్యప్రేమ్‌ కీ కథ సినిమాపై హిందీ జనాల్లో మంచి ఆసక్తే నెలకొంది. ఇప్పటివరక రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

మరోవైపు ప్రమోషన్‌లు కూడా ఫుల్ స్వింగ్‌లో చేస్తుండటంతో హిందీ ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది.అది పక్కన పెడితే కియారా అద్వానీ తల్లి కాబోతుందా అంటే అవుననే అంటుంది హిందీ మీడియా. ప్రస్తుతం ఈ బ్యూటీ సత్యప్రేమ్‌ కీ కథా సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జైపూర్‌లో కార్తిక్‌తో కలిసి ఈ బ్యూటీ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తల్లి కాబోతున్న కియారా అద్వానీ

కాగా ఈ ఫోటోలలో కియారా బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపించింది. దాంతో పలువురు నెటిజన్లు ఏదైనా శుభవార్త ఉందా కియారా జీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా నిజంగానే కియారా ప్రెగ్నెంట్‌ అయిందా? లేదంటే ఆమె వేసుకున్న డ్రెస్‌ వల్ల అలాగా కనిపించిందా అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఈ న్యూస్‌ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. అయితే దీనిపై కొందరు మాత్రం కియారా వేసుకున్న డ్రెస్‌ వల్లే అలా కనిపిస్తుంది.. ఒకవేళ నిజంగానే ఆమె ప్రెగ్నెంట్‌ అయితే.. అంత మంచి శుభవార్త చెప్పకుండా ఉండదు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Leave a Reply