మనోజ్ మౌనిక వెడ్డింగ్ వీడియో..! శివుడికి వినాయకుడు నాకు నాకొడుకు

మంచు మనోజ్ భూమా మౌనిక గత నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉంటూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మార్చి మూడవ తేదీ ఈ దంపతులు మంచు లక్ష్మి నివాసంలో కొద్దిమంది సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం మనోజ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారనే విషయాలను వెల్లడించారు.

ఇక పెళ్లి సమయం నుంచి మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లిలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అన్నింటిని ఒక వీడియో ఒక చిత్రీకరించి ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకి ఏం మనసు అంటూ సాగిపోయే పాటను జత చేసి ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంట్లో నేను ఒక మాట చెబితే నో చెప్పరు.పైగా అది నా సమస్య.అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాను అని చెప్పుకొచ్చాడు హీరో మంచో మనోజ్.అందుకు మౌనిక కూడా ఓకే చెప్పిందని సంతోషంగా తెలిపారు.శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు.ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది.ఆ సమయంలో చాలా కష్టపడ్డాము చాలా దేశాలు తిరిగాము.అలా చెప్పుకుంటూ పోతే రెండవ సీజన్ కూడా మన షోనే నడుస్తుంది ఒక్కో ఎపిసోడ్ కి ఒక కథ చెబుతాను అంటూ ఫన్నీగా స్పందించారు.

Leave a Reply