అవకాశం కావాలంటే ప** క్కలోకి రమ్మన్నారు.. న‌య‌న‌తార షాకింగ్ కామెంట్స్‌!

ప‌రిశ్ర‌మ‌లో త‌ర‌చూ వినిపించే మాట‌. హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది కాస్టింగ్ కౌచ్‌. ఒక‌ప్పుడు సినీ తార‌లు ఈ విష‌యంపై అస్సలు మాట్లాడేవారు కాదు. కానీ, ఇప్ప‌టి న‌టీమ‌ణులు ధైర్యంగా త‌మ‌కు ఇండ‌స్ట్రీలో ఎదురైన చేదు అనుభ‌వాల‌ను బ‌హిరంగంగానే బ‌య‌ట‌పెడుతున్నారు.అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అవుతూనే ఉన్నారు.

నటులపై, నిర్మాతలపై, దర్శకులపై ఇప్ప‌టికే చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో లేడీ సూప‌ర్ న‌య‌న‌తార కూడా చేరింది. ఆఫ‌ర్లు కావాలంటే త‌న‌ను పక్కలోకి రమ్మన్నార‌ని న‌య‌న‌తార ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న న‌య‌న‌తార‌.. కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉంది.

లేదు అని నేను అస్స‌లు చెప్పను. కానీ అది మనం ప్రవర్తించే తీరును బట్టి మనకు ఎదురవుతుంది. దాన్ని ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. నన్ను కూడా కెరీర్‌ స్టార్టింగ్‌ లో కమిట్‌ మెంట్లు అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. నా ట్యాలెంట్‌ తోనే ఈ స్థాయికి వచ్చాను` అంటూ నయనతారచెప్పుకొచ్చింది.దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అభిమానులు, నెటిజ‌న్లు న‌య‌న‌తార కామెంట్స్ పై షాక్ అయిపోతున్నారు. న‌య‌న‌తార వంటి స్టార్ హీరోయిన్ కే కాస్టింగ్ కౌచ్ త‌ప్ప‌లేదు అంటే.. ఇక చిన్న చిన్న న‌టీమ‌ణుల ప‌రిస్థితి ఏంటి అంటూ చాలా మంది అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. న‌య‌న‌తార ప్ర‌స్తుతం బాలీవుడ్ జవాన్‌అనే మూవీ చేస్తోంది. అలాగే త‌మిళంలోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది.

Leave a Reply