Keerthy Suresh | కీర్తి సురేష్ తల్లికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే,

Keerthy Suresh | తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే కీర్తి సురేష్ కుటుంబంలో ఆమె తల్లి కూడా ఒక హీరోయిన్ అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఈమె తల్లి మేనక 1980 లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా సౌత్ ని ఏలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మలయాళం ,తమిళ్ వంటి పరిశ్రమలో కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించింది ఈమె.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో హీరోగా నటించినటువంటి పున్నమి నాగు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ సీనియర్ నటి మేనక సురేష్ గురించి అప్పటి తరం సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే మేనక సురేష్ మాతృభాష తమిళం కావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమా అవకాశాలు దక్కించుకుంది.కానీ తెలుగులో అడపాదడపా చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది.ఇప్పటికీ మేనక సురేష్ కుమార్ కూతురు తెలుగులో స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు.

అయితే ఇంతకీ ఆమె కూతురు ఎవరని అనుకుంటున్నారా.? ఆమె ఎవరో కాదు తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన “నేను శైలజ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ కీర్తి సురేష్.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.దాంతో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఇందులో ముఖ్యంగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రంలో అలనాటి అందాల తార సావిత్రి పాత్రలో నటించి తన నటనా ప్రతిభని నిరూపించుకుంది. అయితే కీర్తి సురేష్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభ, అందం, అభినయంతో ఎంతగానో ప్రేక్షకుల్ని అలరించింది.అందువల్లనే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందుతోంది.

Leave a Reply