Niharika : నిహారికపై దారుణంగా ట్రోల్స్.. ఎందుకో తెలుసా..!

కొంతకాలంగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొనిదెల వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి..ముఖ్యంగా తన భర్త నాగచైతన్య నిహారిక మధ్య విభేదాలు వచ్చాయంటూ విడాకులు కూడా తీసుకున్నారంటూ పలు కథనాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా సమాచారమైతే కుటుంబ సభ్యులు తెలియజేయలేదు.

ఇప్పటికీ ఇవన్నీ మీడియా ఊహాగానాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది.కానీ ఈ వార్తలు నిజమా కాదా అనే విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు..ఈ వార్తలను ఖండిస్తూ ప్రకటన కూడా చేయలేదు.. ఈ విషయం పూర్తిగా నిహారిక వ్యక్తిగత విషయం కాబట్టి చాలా రహస్యంగా ఉంచినట్లు సమాచారం.

అయితే కొంత గ్యాప్ తర్వాత పలు ఓటిటి వెబ్ సిరీస్ లతో నిహారిక తిరిగి తన నటన జీవితాన్ని ప్రారంభించింది. తాజాగా డేట్ ఫిక్స్ఎల్ అనే వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తోంది ఈ సిరీస్ ఈనెల 19వ తేదీన ఓటీటి లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ఆసక్తిని పెంచగా ఈ సిరీస్లో గాయత్రి అనే అమ్మాయిగా కనిపించబోతోంది.అయితే ఆ వెబ్ సిరీస్ లో నిహారిక చెప్పిన డైలాగుల పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అందులో ఒక గేమర్ గా కనిపించిన నిహారిక ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది.అలా ఆన్ లైన్ లో ఒకరిని ఆఫ్ లైన్ లో ఒకరిని ఇష్టపడుతూ ఉంటుంది.ఇద్దరిలో ఎవరిని భాగస్వామిగా సెలక్ట్‌ చేసుకోవాలో అర్థం కాదు.ఆ సమయంలో నాకు బెడ్‌పై రోషన్‌ కావాలి.కానీ మైండ్‌లో భార్గవ్‌ ఉన్నాడు(రోషన్‌ ఇన్‌ బెడ్‌.భార్గవ్‌ ఇన్‌ ద హెడ్‌) అని డైలాగ్‌ చెప్తుంది.అయితే ఇది చాలామందికి నచ్చలేదు.

Leave a Reply