Niharika | నిహారిక వీపు మీద ఉన్న టాటూను చూసి షాక్ అయిన రాజశేఖర్ కూతుళ్లు.

Niharika | మెగా డాటర్ నిహారిక తెలియని వారుండరు.అయితే ఈమె నెట్టింట్లో చేస్తోన్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు ఆ మధ్య నిహారిక మీద విపరీతంగా ట్రోల్స్ నడిచాయి.ఇకపోతే. మొన్నటి వరకు తన అన్న పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న నిహారిక.. తాజాగా కొత్త ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ లో తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రొడక్షన్ హౌస్ లాంచ్ కి తనే చీఫ్ గెస్ట్ గా వెళ్లింది. మెగా ఫ్యామిలీ కూడా

ఈ ఈవెంట్ కు వచ్చినా.. నిహారిక హడావుడే అక్కడ ఎక్కువగా ఉంది. కొత్తగా పెళ్లి అయిన వరుణ్ తేజ్, లావణ్య జంట కూడా అక్కడికి వచ్చారు. తన మరదలు కోసం అక్కడికి వచ్చి సందడి చేసింది లావణ్య త్రిపాఠి. ఇక వరుణ్ తేజ్ కూడా తన చెల్లి కోసం వచ్చాడు. నాగబాబు, అల్లు అరవింద్, సుశాంత్, రాజశేఖర్ కూతుళ్లు కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు.అయితే.. నిహారిక చీర కట్టుకోవడంతో తన వెనుక అంటే వీపు భాగంలో తను వేసుకున్న టాటూ అందరికీ కనిపించింది.

తన టాటూ గురించి తెలిసిన వాళ్లు పెద్దగా పట్టించుకొని ఉండరు కానీ.. తన టాటూ గురించి తెలియని వాళ్లు మాత్రం నిహారిక టాటూ చూసి షాక్ అయ్యారు. వామ్మో.. ఇదేంటి ఇలా వేసుకుంది టాటూ అనుకున్నారు. రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరు కూడా తన టాటూ చూసి షాక్ అయ్యారు. ఒసేయ్.. ఏంటే ఆ టాటూ అన్నట్టుగా తన వైపు చూశారు.దీన్ని చూస్తుంటే అది నాగబాబు ముఖచిత్రంలా కనిపిస్తోంది. అయితే ఇంతకీ ఆ బొమ్మ ఎవరిది? ఆ టాటూ మీనింగ్ ఏంటన్నది నిహారికకే తెలియాలి. ఇక మొత్తానికి సెలెబ్రిటీలకు మాత్రం ఈ టాటూల పిచ్చి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే..!

Leave a Reply