Vijayakanth | కెప్టెన్ విజయకాంత్ చనిపోలేదు..  భార్య ప్రేమలత

Vijayakanth | కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై ఉదయం నుంచి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు.గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ…

కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని… తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని… త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు. దాదాపు 10 రోజుల నుంచి ఆయన హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి కూడా విజయకాంత్ ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా ఉదయం విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసారు. అందులో .. “విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారు.. కానీ గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నాం. విజయకాంత్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని” వైద్యులు తెలిపారు.

Leave a Reply