Pawan Kalyan | ప‌వ‌న్ ముందు చూపు.. ఇండియాని భార‌త్‌గా మార్చాల‌ని గ‌తంలోనే చెప్పిన జనసేనాని,

Pawan Kalyan | భారతదేశంగా ఇండియా పేరుని మార్చాలని బీజేపీ డిసైడ్ అయిందని అంటున్నారు. ఆ దిశగా చురుకుగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ అయిదు రోజుల పాటు ఆదివారాలు సెలవు కూడా లేకుండా నిర్వహించే పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో బిల్లు పెట్టి మరీ భారత్ గా పేరు మార్పు చేస్తారు అని అంటున్నారు.నిజానికి ఇండియా దట్ ఈజ్ భారత్ అని పేరు రాజ్యంగంలో ఉండనే ఉంది. ఇక భారతదేశం పేరు మార్పు వల్ల బీజేపీ రాజకీయంగా లబ్ది పొందడానికి ఇదంతా చేస్తోంది అని విపక్షాలు అంటున్నాయి.

భారత్ వర్సెస్ ఇండియా అన్న పేర్లలో భారత్ కి ఓటేసేవారూ ఉన్నారు. ఇండియా అయితేనేంటి అన్న వారు ఉన్నారు.అయితే మెజారిటీ ప్రజల సెంటిమెంట్ ని ఎమోషన్స్ ని పట్టుకుని భారత్ పేరు మార్పుతో రేపటి రాజకీయాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో భారత్ పేరును మార్చాలని పార్లమెంట్ బయటా లోపలా డిమాండ్ చేసినది ఎక్కువ మంది బీజేపీ వారే.

ప‌వ‌న్ ముందు చూపు..

అలాగే దాని అనుబంధ సంస్థలకు చెందిన వారే.కానీ ఇప్పటికి అయిదేళ్ళ క్రితం ఏపీకి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతదేశం అన్నదే అసలు పేరు అంటూ గట్టిగానే చెప్పారు. ఆయన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇండియా అన్నది పరాయి పాలకులు బ్రిటిష్ వారు పెట్టిన పేరు అన్నారు. భారతదేశమే అసలైన పేరు అని నాటి సభలో చెప్పారు.పవన్ అభిమానులు ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

‘ఇండియా అనేది అరువు తెచ్చుకున్న పేరు. అది బ్రిటిష్ వారు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది. ఇదే అసలు పేరు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రి-రిలీజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా, భారత్ మధ్య తేడా ఏంటో పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల కిందటే చెప్పారని, నిజమైన నాయకుడని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply