Prabhas Venu Swamy : ఇంకా జీవితంలో ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. అన్న వేణు స్వామి.. కానీ సలార్ మాత్రం..

allroudadda

Prabhas Venu Swamy : సినీ సెలబ్రిటీలకు చెందిన వ్యక్తిగత జీవితాలు, జాతకాల గురించి చెబుతూ వేణు స్వామి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం వెనకేస్తున్నారు.పబ్లిసిటీ కోసం తాను వాళ్ల జాతకాలు చెబుతున్నానని, తాను చెప్పినవి వంద శాతం జరిగాయని చెప్పుకొచ్చారు.అందువల్లే జనం తనపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని వేణు స్వామి గతంలో చెప్పిన మాటలు నిజమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు ప్రేక్షకుల్లో ప్రాధాన్యం ఏర్పడింది.ఇటీవలే పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి దంపతులు కలిసి ఉండే అవకాశాలు లేవని వేణు స్వామి అంటున్నారు.దీంతో ప్రభాస్ అభిమానులు ఓ వైపు, మరోవైపు మెగా అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అది పక్కన పెడితే న్నిరోజుల క్రితం ప్రభాస్ జాతకం ఈయన చెప్పడమే. ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని, హిట్లు ఉండవని, ప్రభాస్ పనిపోయిందని చెప్పుకొచ్చాడు..

allroudadda
allroudadda

ప్రభాస్ ఈజ్ బ్యాక్..

అంతేకాకుండా పెళ్లి యోగం కూడా లేదు అని చెప్పాడు.ఇక పెళ్లి గురించి ఏమో కానీ.. నేడు సలార్ సినిమా హిట్ అవ్వడంతో..వేణుస్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ ఈజ్ బ్యాక్.. అంటూ చెప్పుకొస్తున్నారు. మాములుగా ప్రభాస్ జాతకాలు నమ్మడట..

వాళ్ళ కుటుంబంలో మిగిలినవారు చెప్పడం తప్ప ఏరోజు ప్రభాస్ వీటిని పట్టించుకోలేదని వేణుస్వామి స్వయంగా చెప్పుకొచ్చాడు. కష్టాన్ని నమ్ముకోవడమే కానీ, జాతకాల మీద ఆధారపడేవాడు కాదు డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి యోగం లేదన్న వేణుస్వామి మాటలను మళ్లీ బ్రేక్ చేస్తూ.. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి కబురు చెప్తాడేమో చూడాలి.

Leave a Reply