Python | క్రికెటర్‌ ఇంట్లో కొండచిలువ..పాపం ఏం చేశాడో చూడండి..!

Python In Glenn McGrath Home

Python | ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఇటీవల ప్రపంచ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 1999, 2003, 2007 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మూడు మెగా టోర్నీల్లో మెక్‌గ్రాత్ కీలక ప్లేయర్ గా ఉన్నారు.

మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ విషయాలకు సంబంధించి మెక్‌గ్రాత్ సోషల్ మీడియాలో సందడి చేస్తారని అందరూ భావిస్తారు. కానీ, మెక్‌గ్రాత్ మాత్రం పైథాన్ (కొండ చిలువ)తో ఆడుకుంటూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన ఇంట్లో కార్పెట్‌ పైథాన్‌ చొరబడినట్టు గుర్తించిన మెక్ గ్రాత్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తేరుకున్న ఆయన ధైర్యం చేసి దాన్ని ఇల్లు తుడిచే మాప్ కర్ర సాయంతో పట్టేశారు.

ఇది చదవండి:  మహిళలకు వ‌డ్డీ లేకుండా రూ.3 ల‌క్ష‌ల లోన్‌..

ఇంట్లో దూరిన కొండచిలువ..

మాప్ కర్రతో కొండచిలువ తలభాగం వద్ద అదిమి పట్టి తోక పట్టుకుని సురక్షితంగా తీసుకెళ్లి చెట్లలో విడిచి పెట్టినట్టు మెక్ గ్రాత్ వెల్లడించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తన భార్య సారా లియాన్ మెక్ గ్రాత్ సహకారంతో ఇంట్లోకి ప్రవేశించిన మూడు కార్పెట్ కొండ చిలువలను పట్టుకుని బయటకు పంపించినట్టు మెక్ గ్రాత్ తెలిపారు. కొండ చిలువ విషసర్పం కాకపోయినా, అది కాటు వేస్తే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా అది కాటు వేసినా, వెంటనే విడిచి పెట్టదు.

Leave a Reply