Rakhi Festival 2023: రాఖీ పండుగ ఎప్పుడు? ఏ టైంలో రాఖీ కట్టాలో తెలుసా ?

Rakhi Festival 2023 | ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రెండు రోజులపాటు జరుపుకోనున్నారు. ఇది ఆగస్టు 30న ప్రారంభమై..ఆగస్టు 31 వరకు ఉంటుంది. అయితే రాఖీని శుభముహూర్తంలో కడితేనే సోదరుడికి మేలు జరుగుతుంది. భద్రకాలంలో అస్సలు రాఖీని కట్టకూడదు. ఆ సమయంలో కడితే మీ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

రాఖీ కట్టడానికి శుభ సమయం

30న బుధవారం రాత్రి 9.02 గంటల నుంచి ఆగస్టు 31 ఉదయం 7.05 నిమిషాల లోపు కట్టొచ్చని కొందరు పండితులు చెబుతున్నారు.ఆగస్టు 31న రాఖీ పండుగ నిర్వహించుకోవాలనుకుంటే ఉదయం 6.02 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు రాఖీ కట్టొచ్చని మరికొందరు చెబుతున్నారు. ఇదే రోజు మరికొన్ని సమయాల్లో రాఖీ కట్టొచ్చని అన్నారు.

మధ్యాహ్నం 12.21 గంటల నుంచి 3.32 గంటల లోపు రాఖీ కట్టుకోవచ్చని చెబుతున్నారు. అలాగే సాయంత్రం 5.08 గంటల నుంచి 8.08 గంటల లోపు రాఖీ కట్టుకోవచ్చని చెబుతున్నారు. ఈసారి రెండు రోజుల్లో పౌర్ణమి రావడంతో ఇలాంటి సమయాలు ఏర్పడ్డాయని పండితులు చెబుతున్నారు.ఇక రాఖీ పౌర్ణమి చరిత్రలోకి వెళితే.. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు.

శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలి చక్రవర్తికి రాఖీ బంధం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. మరో కథనం ప్రకారం. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టిందట. అలా కట్టినందుకు ఎల్లవేళలగా తనకు అండగా ఉంటానని మాట ఇస్తాడు. అలా రాఖీ పౌర్ణమి పండుగ నిర్వహించుకుంటారని చెబుతున్నారు.

Leave a Reply