Rudraksha | రుద్రాక్షలు ఎన్ని రకాలు ? ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి?

రుద్రాక్ష అంటే :– రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు.

ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది.రుద్రాక్షలతో నిద్రించడం, వాటిని ధరించి శృం( గారంలో) పాల్గొంటే ప్రతికూల ఫలితాలు ఎదురువుతాయి.

ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితం

ఏకముఖి రుద్రాక్ష చాలా విలువైనది. ఎలాంటి మంత్ర తంత్ర ప్రయోగాలను అయినా తిప్పి కొట్టగలదు. దీన్ని ధరించడం వల్ల సిరి సంపదలు, శిరో సంబంధ రోగాలు తగ్గుతాయి.
ద్విముఖి రుద్రాక్షను బ్రహ్మ రుద్రాక్ష అని అంటారు కొందరంటే… అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని మరికొందరు చెబుతారు. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెబుతారు. మానసిక సమస్యను దూరం చేస్తుంది.

షణ్ముఖి రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం. దీన్ని ధరిస్తే శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభిస్తుందట.
సప్త ముఖి రుద్రాక్ష వల్ల సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతాయట.
అష్ట ముఖి రుద్రాక్ష ధరించిన వాపిరివ ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందట..
నవముఖి రుద్రాక్ష భైరవ స్వరూపమైనది. రాజకీయాల్లో ఉన్నక స్థానాన్ని ఆశించేవారికి , అపమృత్యు నివారణ దోషాలు తగ్గించేందుకు నవముఖి రుద్రాక్ష పనికొస్తుందట.

దశముఖి రుద్రాక్ష దశావతారాలెత్తిన విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఈ రుద్రాక్ష గొంతు సంబంధ రోగాలను, నవగ్రహాల ద్వారా కలుగే కష్టాలు, సమస్యలు నివారణ అవుతాయట.
ఏకాదశ ముఖి ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందం ఉండడంతో పాటూ, గర్భ సంబంధ రోగాలు నయమవుతాయట.

Leave a Reply