ISRO Chairman | ఇస్రో చైర్మన్ సోమనాథ్ జీతం ఎన్ని లక్షలో తెలుసా..!

isro chairman | చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని, ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మనం చంద్రయాన్-3ని విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ చేశామని, ఇప్పుడు జాబిలిపై భారత్ నిలిచిందన్నారు.

ఎస్.సోమనాథ్ కేరళలోని తురవూరులో 1963 లో జన్మించారు. కొల్లంలోని TKLM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాకా బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సోమనాథ్ 1985 లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో చేరారు. 2010 లో ఈ సెంటర్‌కు అసోసియేట్ డైరెక్టర్ అయ్యారు.

కె.శివన్ నుండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2022 లో కె.శివన్ తర్వాత మళ్లీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.సోమనాథ్ ఏరో స్పేస్ ఇంజనీర్, సాంకేతికత నిపుణులు. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన దోహదపడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? ఇచ్చే ప్రోత్సాహకాలు.. ప్రయోజనాలు ఏంటి అనేవి తెలుసుకోవాలనే కుతూహలం చాలామందిలో ఉంది. ఇస్రో చైర్మన్ జీతం అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది బేసిక్ పే గా తెలుస్తోంది.

ఇతర అలవెన్స్‌లు అన్నీ కలిపి రూ.10 లక్షలు దాటొచ్చునట. ఆయనకు భారీ భద్రత కూడా ఉంటుంది.ఇస్రో చైర్మన్ ఆయన కుటుంబ సభ్యులు భారతదేశంలో లేదా విదేశాల్లో ఏదైనా ప్రభుత్వ లేదా ఎంపానెల్ ఆసుపత్రిలో ఉచిత వైద్య చికిత్స తీసుకోవచ్చును. వైద్య పరీక్షలు, మెడిసిన్స్ కోసం అయ్యే ఖర్చులను కూడా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇస్రో చైర్మన్ 65 సంవత్సరాల వయసులో లేదా ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన ఏది ముందుగా ఉంటే అది పదవీ విరమణ చేయవచ్చును. పదవీ విరమణ తర్వాత ఆయన చివరగా డ్రా చేసిన బేసిక్ పే , డియర్‌నెస్ అలవెన్స్‌లో 50% కి సమానమైన పెన్షన్ పొందుతారు.

Leave a Reply