childhood photo | ఈ పిక్ లో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

childhood photo | తెలుగు ఇండస్ట్రీలో అందగాడు ఎవరు అంటే ఇప్పటి తరం ప్రేక్షకులంతా ముక్తకంఠంతో చెప్పే మాట మహేష్ బాబు. ఎవరైనా కాస్త పోజ్ కొడితే చాలు.. అబ్బా మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నాడ్రా వీడు అంటారు. అంతటి అందం సూపర్ స్టార్ సొంతం. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఆ రోజుల్లో మీరు కుమ్మేసుంటారు అంటూ సంతోషం సినిమాలో కోటను బ్రహ్మానందం అంటాడు కదా..

ఇప్పుడు మహేష్ బాబును చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. వయసు 40 దాటిన తర్వాత కూడా కుర్ర హీరోలకు ఈయన గ్లామర్ కుళ్లు తెప్పిస్తుంది. అలాంటిది చిన్నపుడు ఇంకెంత క్యూట్‌గా ఉండుంటాడు..?పైగా నాలుగేళ్ల వయసు ఉన్నప్పట్నుంచే నటించడం మొదలుపెట్టాడు సూపర్ స్టార్.

1979లో నీడ సినిమాలో ఈయన తెరపై కనిపించాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి చాలా సినిమాలు చేసాడు. సోలో హీరోగా బాలచంద్రుడు లాంటి సినిమాల్లో నటించాడు మహేష్ బాబు. ఆ తర్వాత చదువు కోసం గ్యాప్ తీసుకున్నాడు. అప్పట్లో తండ్రి కృష్ణతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవే మీకోసం.. అభిమానులు చూసి పండగ చేస్కోండి మరి.

Leave a Reply