విజయ వర్మతో పెళ్లిపై తమన్నా కామెంట్స్..!

గత కొంతకాలంగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా Tamannaah మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమించుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. విజయ్‌ వర్మ తనపై ఎంతో శ్రద్ధ చూపుతాడని.. అతడితో ఉంటే సంతోషంగా ఉంటానని తమన్నా చెప్పింది. ‘సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు.

కానీ విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం’ అని చెప్పింది.

వీరిద్దరి అప్‌ కమింగ్ సిరీస్‌ లస్ట్ స్టోరీస్‌ 2 ప్రమోషన్లో ఉన్న తమన్నా Tamannaah .. ఇంకా చాలా విషయాలే పంచుకున్నారు. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే సంతోషంగా ఉంటామనే ఫీలింగ్ మనకు కలగాలని.. అదే విజయ్‌తో తనకు కలిగిందన్నారు తమన్నా. తాను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించానని.. వాళ్లందరి కంటే తనకు విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తన్నారు. విజయ్‌ తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, కష్టం వస్తే తనతోనే ఉంటాడనే నమ్మకం బలంగా ఉందన్నారు. ఇప్పుడీ మాటలతో.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ.

Leave a Reply