astrology | శరీరంపై బల్లి పడితే శుభమా, అశుభమా? తప్పక తెల్సుకోండి,

Astrology | ఇంట్లో బల్లులు తిరిగితె ఎవరు మాత్రం చూడ్డానికి ఇష్టపడతారు? బల్లి మనం పెంచుకునే కుక్క పిల్ల లేదా పిల్లి కాదు కదా ఇష్టపడటానికి.బల్లిని చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది కొందరికి.

అన్నం తింటున్నప్పుడు బల్లి కనబడితే వాంతులు చేసుకుంటారు కొందరు.బల్లి అంటే మనిషికి అంత అసహ్యం.ఇక బల్లి శాస్త్రాన్ని నమ్మే బ్యాచ్ మరొకటి.బల్లి ఇక్కడపడితే ఇలా జరుగుతుంది, అక్కడ పడితే అలా జరుగుతుంది అనుకుంటూ నసపెడుతుంటారు.

పురుషులు, మహిళలకు మధ్య వ్యత్యాసం..

పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభంకలుగుతుందని నమ్ముతారు. అయితే ఇదే సమయంలో మహిళల ఎడమ భాగంపై బల్లి పడితే వారికి శుభాలు ఉంటాయి. పురుషుడు ఎడమ భాగంపైన, స్త్రీ కుడి భాగంపైన బల్లి పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అయితే రాత్రి సమయంలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

ఇక్కడ పడితే ఆర్థిక నష్టం..

పురుషుడి చేతిపై బల్లి పడితే ఆర్థికనష్టం కలుగుతుంది. వేళ్ల మీద పడితే పాత మిత్రులను కలిసే అవకాశం, కుడి చేతిపై పడితే కష్టాలు వస్తాయని సంకేతం. ఎడమ చేతిపై బల్లి పడితే అవమానం జరుగుతుంది, తొడలపై పడితే వస్త్ర నష్టం, మీసాలపై పడితే సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటారని బల్లి శాస్త్రం చెబుతుంది.

Leave a Reply