Today Gold Price | శ్రావణ మాసం వచ్చేసింది… ఇంకా మహిళలకి గుడ్ న్యూస్.. నేడు బంగారం, వెండి ధరలు..?

Gold and Silver Prices | శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఇవాళ బంగారం ధర మాత్రం స్థిరంగానే ఉంది.

ఇక వెండి ధర మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. కిలోపై ఏకంగా రూ.3 వేల పైనే పెరగడం గమనార్హం. బంగారం అయితే ఇటీవలి కాలంలో తగ్గడమే తప్ప పెరగడం లేదు కాబట్టి స్థిరంగా ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీలవ్వాల్సిన విషయమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.76,700గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,170 గా కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020,హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,020 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,020,

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300, బెంగళూరులో వెండి ధర రూ.72,500,హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి కిలో ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.

Leave a Reply