Tomato | రికార్డు స్థాయిలో టమోటా ధరలు,త్వరలో కిలో రూ.400పైనే …

టమోటా

Tomato Price | టమోటా ధరలు అధరగొడుతున్నాయి. ములకలచెరువు మార్కెట్‌ యార్డులో శనివారం నాణ్యత గల టమోటా రికార్డు స్ధాయిలో ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ.200పలికింది. నాణ్యతను బట్టి 25 కేజీల బాక్సు రూ.3200 నుంచి రూ.3600 వరకు పలికాయి. టమోటా ధరలు రోజురోజుకు భారీగా పెరిగి పోతున్నాయి. స్ధానిక మార్కెట్‌ నుంచి టమోటాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ, చత్తీస్‌ఘడ్‌, గుజరాత తదితర రాషా్ట్రలకు ఎగు మతి అవుతున్నాయి.

 tomato prices
tomato prices

కాగా బయటి మార్కెట్‌లో కిలో ధర రూ.120 నుంచి రూ.130 వరకు అమ్ముతు న్నారు. దీంతో సామాన్యులు, పేదలు కొనాలంటే భయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ఏంకొనాలన్నా.. ఏంతినా లన్నా సామాన్య, మధ్య తరగతి జనం హడలిపోతున్నారు. ఇక టమోటా ధరలు చెప్పడానికి వీలులేకుండా ఉంది. అసలు టమోటా Tomato అంటేనే ఇంట్లో చాలా మంది ప్రస్తుతానికి వాడకమే పక్కనపెట్టారు.

 tomato prices
tomato prices

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఇక్కడ నుంచి టమాటా Tomato సరఫరా తక్కువగా ఉండడంతో టమాటా ధరలు రూ.400 దాటే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మార్కెట్‌ వ్యాపారులు చెబుతున్నారు.. ఆగస్టు 2 న, ఢిల్లీలో టమోటా హోల్ సెల్ లో కిలో రూ. 203 ఉండగా.. రిటైల్ గా కిలో ధర రూ. 250కి చేరుకుంది.

మదర్స్ డైరీ అవుట్లెట్. మరోవైపు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కిలో రూ.263కి చేరుకొని దేశంలోనే అత్యంత ఖరీదైన టమోటాగా రికార్డ్ సృష్టించింది..నెల రోజులుగా కిలో 300 రూపాయలు దాటేలా కనిపిస్తుంది.. మరో నెల రోజుల్లోనే కిలో టమోటా రూ.400 దాటేలా కనిపిస్తుంది.

 tomato prices
tomato prices

Leave a Reply