పాపం రావణాసురుడి తలలని ట్రోల్ చేశారు.. కానీ అదే నిజమా..

ఏ సినిమా అయినా అందులో ఏ హీరో ఉన్న ఈ రోజుల్లో ట్రోలింగ్ తప్పడం లేదు.మన తెలుగు హీరోలు ఒకరిపై ఒకరు గౌరవం చూపిస్తున్న స్నేహంగా కలిసి మెలిసి ఉంటున్న ఫ్యాన్స్ మాత్రం అలా ఉండడం లేదు.వారి మధ్య మాత్రం రచ్చ సాగుతూనే ఉంది.హీరో ఎవరైనా సరే వారి హీరో కాకుంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు గురి అవ్వక తప్పదు.ఆ హీరో సినిమాలో ఏ చిన్న పొరపాటు జరిగిన ఏ చిన్న లోపం కనిపించిన ట్రోలింగ్ తప్పదు.

మరి ఆదిపురుష్ సినిమా విషయంలో కేసుల ఇదే జరిగింది.ఆదిపురుష్ లో ప్రభాస్ ఉన్న.రామాయణం లాంటి ఇతిహాస కథ అయినప్పటికీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండే ట్రోల్స్ చేసే వారికీ మంచి మసాలా దొరికింది.వీరు ట్రోల్స్ బారి నుండి తప్పించుకోలేక సినిమాను సైతం వాయిదా వేశారు.ఐతే గత నెల విడుదలైన ఈ సినిమా ఆశించినవారిని నిరాశపరిచింది..

500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించామని, రిలీజ్ కు ముందు మేకర్స్ అన్నారు. కానీ మూవీ రిలీజ్ అయిన తరువాత విజువల్ ఎఫెక్ట్స్ పైనా, పాత్రల వస్త్రధారణ పైన, ముఖ్యంగా రావణుడి పత్ర చిత్రీకరణ పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. రావణుడు వాహనంగా ఉపయోగించిన పక్షిని, రావణాసురుడి పది తలలను ఒకేవరుసలో చూపించకుండా ఒకదాని పైన మరొక వారుసను చూపించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.

అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రభాస్ రాజు ఫ్యాన్ పేజ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో రావణాసురుడి తలలను అలా చూపించడాన్ని సపోర్ట్ చేసినట్లుగా ఉంది. అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు ఓం రౌత్ కు తెలియదనుకోవాలా? అయితే దానికి కూడా ఒక ఆధారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై రావణుడి దశకంఠ రూపం 10 తలలు అడ్డంగా ఒకేవరుసలో కాకుండా త్రికోణాకారంలో 3 అంచెలలో అమర్చబడి కనిపిస్తాయి. ఆదిపురుష్ సినిమాలో అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై ఉన్నట్టుగానే చూపించారు” అని చెప్పుకొచ్చారు.

Leave a Reply