Upasana Konidela | అత్త‌మ్మ కోసం కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన ఉపాస‌న‌

allroudadda

Upasana Konidela | మెగా కోడలు ఉపాసన కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉపాసన ఇప్పటికే పలు వ్యాపారాలతో బిజీగా ఉండగా ఆ వ్యాపారాలతో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఉపాసన కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సైతం ఎక్కువ సమయం కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. ఈరోజు చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు కాగా ఉపాసన సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఒక వీడియోను షేర్ చేశారు.

‘అత్తమాస్ కిచెన్’ పేరుతో తన అత్తగారు బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ కొత్త వ్యాపారం ద్వారా అత్తాకోడళ్లిద్దరూ కొణిదెల వారి వంటింటి రుచుల్ని అందరికీ పరిచయం చేయబోతున్నారు. అత్తమ్మ పుట్టినరోజు సందర్భంలో మా ఫ్యామిలీ ‘అత్తమాస్ కిచెన్’ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది..

allroudadda
allroudadda

రుచి, సంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉన్నచోటనే రుచుల మిశ్రమాన్ని అనుభవించండి.. నేరుగా మా వంట గది నుండి మీ ఇంటికి’ .. అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నిజానికి చిరంజీవి షూటింగ్స్ నిమిత్తం నెలల తరబడి బయట ఉన్నప్పుడు ఇంటిā రుచులు మిస్ కాకుండా సురేఖ ఇలాంటి మిశ్రమాలను ప్యాక్ చేసి ఇచ్చేవారట.దాని నుండి ప్రేరణే ఈ బ్రాండ్ ప్రారంభానికి పునాది అని తెలుస్తోంది.

మీకు ఆకస్మికంగా కలలో డబ్బులు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా?

ఈ వెంచర్‌లో ఉపాసన కీలకపాత్ర వహిస్తున్నారు. https://athammaskitchen.com అనే వెబ్ సైట్ ద్వారా వంటకాలను బుక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలియనుండనున్నాయి. ఓన్లీ హైదరాబాద్ లోనే పంపిణీ చేస్తారా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉపాసన స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అత్తకు తగ్గ కోడలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన పెట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Leave a Reply