Kodali Nani | బొచ్చుల లేస్ అంటూ.. చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని రియాక్షన్..

Kodali Nani

Chandrababu | వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, వైనాట్ పులివెందుల అంటున్న బాలకృష్ణకు వచ్చే ఎన్నికల్లో జగన్ అంటే ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు. జగన్ వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ, చంద్రబాబులను ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. అయితే ఆదివారం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.(Chandrababu)

Chandrababu
Chandrababu

నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా, కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.తాజాగా చంద్రబాబు అర్ద్రరాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు.(Chandrababu)

Chandrababu
Chandrababu

కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కు ఆయన తరపు న్యాయవాదులు నిర్ణయించారు.దీనిపై కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు అరెస్టు నీ నిరసిస్తున్న బాలకృష్ణ, పురందేశ్వరి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు బొచ్చు లేదని పురందేశ్వరికి బ్రెయిన్ లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఎఫ్ఐఆర్ లో లేనిది.. ఎక్కడ అని నిలదీశారు.(Chandrababu)

ఇది చదవండి:  చంద్ర‌బాబుతో పెట్టుకోవద్దు జగన్.. చాలా ఇబ్బంది పడతావు.. చంద్ర‌బాబు భార్య ,

Chandrababu
Chandrababu

ఆనాడు ఎన్టీఆర్ చంద్రబాబుని అవినీతి చక్రవర్తి అంటూ చెప్పారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని బాలయ్య పురందేశ్వరి వెనకేసుకొస్తున్నారు. బాలకృష్ణ బొచ్చుల లేస్, పురందేశ్వరి బ్రెయిన్ లెస్. ఎన్టీఆర్ కడుపున పుట్టిన వీళ్ళకి సిగ్గులేదు. చంద్రబాబు 420 అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు.

ఇది చదవండి:  కూతుర్లకు జగనన్న అంటే ఎంత ప్రేమో చూడండి

ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టును ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా మండిపడ్డారు. తన సొంత లాభం కోసం పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పార్టీ పెట్టించారని, తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడానికి తప్ప పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడని కొడాలి నాని విమర్శించారు.

Leave a Reply