Vaishnavi : వైష్ణవి చైతన్య తీన్మార్ డాన్స్ కుమ్మేసింది👌..! దండం పెట్టేసాడు

Vaishnavi Chaitanya

తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య Vaishnav Chaitanya పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుంది. ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుని.. ‘బేబి’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలు వైష్ణవి చేసిన క్యారెక్టర్‌ని తిట్టుకుంటున్నారంటే తను ఎంతలా ఆ పాత్రలో లీనమై నటించిందో అర్థం చేసుకోవచ్చు.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

అయితే ఇక్కడి వరకు రావడం వెనుక ఎంతో కష్టపడింది వైష్ణవి. ఇటీవల పలు ఇంటర్వూల్లో తన కెరీర్ స్టార్టింగ్ నుండి ‘బేబి’ వరకు జరిగిన జర్నీ గురించి చెప్తూ భావోద్వేగానికి గురైంది. డ్యాన్స్ అంటే చాలా ఇష్టమున్న వైష్ణవి క్లాసికల్‌తో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. స్కూలు, కాలేజీలో ఏ ఈవెంట్ జరిగినా అందులో తన డ్యాన్స్ ఉండాల్సిందే.

15 ఏళ్ల వయసులోనే ఆఫర్ల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఓ ఈవెంట్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే ఏడు వందల రూపాయలు ఇచ్చారు. ఆమెకు అదే ఫస్ట్ రెమ్యునరేషన్. తర్వాత కొద్ది రోజులకి ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

‘అల వైకుంఠపురములో’, ‘టచ్ చేసి చూడు’ లాంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ‘బేబి’ తో హీరోయిన్ కావాలనే తన కలను నెరవేర్చుకుని, ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమా నిర్మాతతో ఏకంగా మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది.తాజాగా సినిమా ప్రమోషణలో Vaishnav Chaitanya వైష్ణవి చేసిన డ్యాస్ చూసి విజయ్ దేవరకొండ కూడా స్టాన్ అయ్యాడు.. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెయ్యండి,

Leave a Reply