Vishnu Priya: పెళ్లి అంటే నాకు గుర్తొచ్చేది అది మాత్రమే.. పబ్లిక్‌లో విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్,

Vishnu Priya:  విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోల్లో నటించారు. పోవే పోరా అనే యూత్ఫుల్ షోతో బుల్లితెరకు ప్రమోట్ అయ్యింది. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించారు. ఇటీవల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక పాత్ర చేశారు.

విష్ణుప్రియ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు.ఇక యాంకర్ విష్ణు ప్రియకి కూడా సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్.. పాప పోస్ట్ పెట్టిందంటే.. వైరల్ బాటపడుతుంటుంది. తాజాగా ఆమె యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డాకి గెస్ట్‌గా వెళ్లి..

తన అల్లరి చేష్టలతో అల్లాడించింది.ఆమెతో పాటు.. జబర్దస్త్‌ని వీడి వెళ్లిన చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ వీళ్లంతా సందడి చేశారు. అయితే ఎంత మంది ఉన్నా.. యాంకర్ విష్ణు ప్రియమాత్రం తన అల్లరి చేష్టలతో అందర్నీ డామినేట్ చేసేసింది.

‘పెళ్లి అనగానే మనకి ఏమేమి గుర్తొకొస్తాయి’ అని యాంకర్ సుమ ప్రశ్న వేయగా.. శో()భనం అని చెప్పి షాకిచ్చింది యాంకర్ సుమ. షాపింగ్, బంధువులు, నగలు, శుభలేఖలు ఇలా అన్నీ చెప్పింది కానీ.. అక్కడికి వచ్చిన వాళ్లెవ్వరూ కూడా శో(భ)నం గురించి మాట్లాడలేదు కానీ.. యాంకర్ విష్ణు ప్రియ మాత్రం శో(భ)నం అని అనేసింది.పస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a Reply