YS sharmila | షర్మిల కోడలితో వైఎస్ విజయమ్మ.. ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..

YS sharmila

YS sharmila | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతుల తనయుడు వైఎస్ రాజా రెడ్డి (YS Raja Reddy) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.పెళ్లి కూతురి పేరు ప్రియా అట్లూరి (Priya Atluri). చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి.

ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉంది. వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. నాలుగు సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారు.ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి.. అమెరికాకు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమ వివాహానికి అటు వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతులు, ఇటు ప్రియ అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.

YS sharmila | షర్మిల కోడలితో వైఎస్ విజయమ్మ

YS sharmila
YS sharmila

దీనితో వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.తాజాగా ప్రియా అట్లూరిని వైఎస్ విజయమ్మ కలిశారు. లోటస్​పాండ్​లోని ఇంటికి వచ్చిన ప్రియను ఆమె ఆప్యాయంగా స్వాగతించారు. ప్రియ-విజయమ్మ కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రియా అట్లూరీకి విజయమ్మ బంగారు గాజుల్ని ప్రజెంట్ చేస్తూ కనిపించారు. తన మనవడికి కాబోయే భార్యకు స్వయంగా ఆమె వాటిని తొడిగారు.

Leave a Reply