Heroine Aamani | పాపం భర్తతో ఆమని విడాకులకి కారణం ఇదే..

allroudadda

Heroine Aamani | పాపం భర్తతో ఆమని విడాకులకి కారణం ఇదే.. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని.. తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏడాది కాలానికి హీరోయిన్ గా మారింది. 1993లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాతో ఆమని తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అయింది. ఈ సినిమాలో నరేష్ సరసన కథానాయకగా నటించింది.

తొలి సినిమాతోనే ఇక్కడ భారీ హిట్‌ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రాజేంద్ర‌ప్ర‌సాద్ కు జోడీగా మిస్టర్ బెల్లం మూవీలో యాక్ట్ చేసి తెలుగు వారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమాకు గానూ ఉత్త‌మ న‌టిగా నంది అవార్డును అందుకుంది.దాంతో ఆమ‌నికి తెలుగులో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అమ్మ కొడుకు, పచ్చని సంసారం, ప్రేమ నా ప్రాణం, కన్నయ్య కిట్టయ్య, చిన్నల్లుడు, రేపటి రౌడీ, శ్రీవారి ప్రియురాలు, తీర్పు, శుభలగ్నం, అల్లరి పోలీస్ ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమని హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా శుభలగ్నం సినిమా ఆమనికి భారీ స్టార్డమ్ తీసుకొచ్చింది.

allroudadda
allroudadda

తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, కృష్ణ‌ వంటి నటలతో ఆడి పాడింది. అలాగే తమిళ్, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసిన ఆమని.. 1997 తర్వాత కొన్నాళ్లు వెండితెరపై కనిపించలేదు.ఇండ‌స్ట్రీ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమె మళ్ళీ 2004లో మధ్యాహ్నం హత్య మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయక పాత్రలతో ప్రేక్షకుల‌ను మెప్పించింది. ఇప్పటికీ అడపా తడపా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్‌, టీవీ షోస్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఇక ఆమని పర్సనల్ లైఫ్ వస్తే.. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న స‌మ‌యంలోనే తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను ఆమ‌ని పెళ్ళి చేసుకుంది.

ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడితో పాటు ఒక కుమార్తె జ‌న్మించింది.వివాహం అనంత‌రం భ‌ర్త కోరిక మేర‌కు కొన్నాళ్లు ఆమ‌ని సినిమాల్లో క‌నిపించ‌లేదు. కానీ న‌ట‌న‌పై మ‌క్కువ చంపులేక ఆమె మ‌ళ్లీ ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. అయితే రీల్ లైఫ్ లో ఇల్లాలు పాత్రల్లో ప‌ర్ఫెక్ట్ గా ఇమిడిపోయి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచిన ఆమ‌ని.. రియ‌ల్ లైఫ్ లో మాత్రం ఇల్లాలుగా ఇమ‌డ‌లేక‌పోయింది. భ‌ర్త‌తో ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయింది. పిల్ల‌లు పుట్టిన కొన్నేళ్ల‌కు మొహియుద్దీన్ తో ఆమ‌ని విడాకులు తీసుకుంది. తాజాగా ‘ఐ డ్రీమ్స్’ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు.

YS Jagan | వర్షాలకు రోడ్లు అన్నీ కొట్టుకుపోయాయి.. జగన్‌

“నేను సినిమాల్లోకి రావడం మా ఫాదర్ కి ఇష్టం ఉండేది కాదు. కానీ ఆ తరువాత నా ఇష్టాన్ని గమనించి అంగీకరించారు. నేను హీరోయిన్ గా కూడా నిలదొక్కుకోగలనని నమ్మారు. అలాగే నేను ‘మిస్టర్ పెళ్ళాం’ తరువాత దూసుకుపోయాను. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. హీరోయిన్ గా నా స్టార్ డమ్ ను మా ఫాదర్ చూడలేదనే ఒక బాధ నాకు ఇప్పటికీ ఉంది” అన్నారు. “నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లను దాటుకుని నా వరకూ ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పాలి. అలా రావడానికి కారణం భగవంతుడి దయగానే నేను భావిస్తాను. ఇప్పటికీ నేను భగవంతుడినే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను” అని చెప్పుకొచ్చారు.

Recent Posts

Leave a Reply