Singer sunitha | నమ్మి మోసపోయానంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత.

allroudadda

Singer sunitha | సింగర్‌ సునీత (Singer sunitha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మఽధురమైన గొంతుకు ఫిదా కాని వారుండరు. 17 ఏళ్లకే యాంకర్‌గా, గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు తీసుకుంది. అయితే సునీతకు ఇంటి బాఽధ్యతలు ఎక్కువ. ఆమె అమ్మమ్మ నుంచి ఇప్పటికి మూడు తరాల వారిని ఆమె పోషిస్తున్నారు. విడాకులు అయ్యి ఏళ్లు గడుస్తున్నా విమర్శలు మాత్రం ఇంకా ఆమె వెంటాడుతూనే ఉన్నాయి.

బరువు బాధ్యతలు, విమర్శలు ఇన్ని ఒత్తిళ్ల మధ్య వృత్తిని మాత్రం సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. రెండేళ్ల క్రితమే ఆమె మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జనవరి 9న, 2021లో వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని పెళ్లాడింది.అయితే తాజాగా కాగా తాజా ఇంటర్వ్యూలో సునీత తన జీవితాన్ని నెమరు వేసుకున్నారు.లైఫ్ లో ఎదురైన ఒడిదుడుకులు, కష్టనష్టాలు, విజయాలు, వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు.

సునీత మాట్లాడుతూ… జీవితంలో ఎత్తుపల్లాలు చాలా సాధారణం. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొన్నామనేది ముఖ్యం. నా లైఫ్ లో జరిగిన చాలా విషయాలు నేను మర్చిపోయాను. బంధువులు ఆ రోజున నువ్వు ఏడుస్తుంటే చాలా బాధేసిందని గుర్తు చేసినప్పుడు ఆవేదన కలుగుతుంది. నేను చాలా విషయాల్లో మోసపోయాను. నాపై వచ్చిన విమర్శలు అయితే లెక్కేలేదు. 17 ఏళ్లకే కెరీర్ మొదలుపెట్టాను. 19 ఏళ్లకే పెళ్లి, సంపాదన. కుటుంబ బాధ్యత తీసుకున్నాను. 21 ఏళ్ల వయసులో కొడుకు, 24 ఏళ్లకు కూతురు పుట్టింది. నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు. ఉన్న ఇల్లు కూడా పోయింది. 35 ఏళ్ళు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను.

అతనితో ఆ తప్పు చేసిన తర్వాతే బరువు తగ్గాను.. రాశీ ఖన్నా

ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు. మోసపోయానని తెలిశాక ఆశ్చర్యం వేసేది. చాలా మంది నాది ఫేక్ స్మైల్ అంటారు. నాకు సంబంధించిన ఏదైనా విషయం చెప్పడం ఇష్టం లేకపోతే నవ్వి వదిలేస్తాను. దాన్ని కొందరు ఫేక్ స్మైల్ అనుకుంటారు. 28 ఏళ్ల కెరీర్లో 5 వేలకు పైగా షోలు చేశాను. నాది హస్కీ వాయిస్. పదాలు గొంతులో మింగేస్తుందని అనేక విమర్శలు చేశారు. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. స్టూడియో లోపల పర్సనల్ మేటర్స్ ఎందుకు మాట్లాడతారు. నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చేస్తాను. నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం రెండో వివాహం చేసుకోవడం… అని సునీత అన్నారు.

Recent Posts

Leave a Reply