Actress Amani | క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ ఆమని షాకింగ్ కామెంట్స్..

Actress Amani | 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని.. తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏడాది కాలానికి హీరోయిన్ గా మారింది. 1993లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాతో ఆమని తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అయింది. ఈ సినిమాలో నరేష్ సరసన కథానాయకగా నటించింది.

తొలి సినిమాతోనే ఇక్కడ భారీ హిట్‌ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రాజేంద్ర‌ప్ర‌సాద్ కు జోడీగా మిస్టర్ బెల్లం మూవీలో యాక్ట్ చేసి తెలుగు వారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమాకు గానూ ఉత్త‌మ న‌టిగా నంది అవార్డును అందుకుంది.దాంతో ఆమ‌నికి తెలుగులో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అమ్మ కొడుకు, పచ్చని సంసారం, ప్రేమ నా ప్రాణం, కన్నయ్య కిట్టయ్య, చిన్నల్లుడు, రేపటి రౌడీ, శ్రీవారి ప్రియురాలు, తీర్పు, శుభలగ్నం, అల్లరి పోలీస్ ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమని హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా శుభలగ్నం సినిమా ఆమనికి భారీ స్టార్డమ్ తీసుకొచ్చింది.

తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, కృష్ణ‌ వంటి నటలతో ఆడి పాడింది. అలాగే తమిళ్, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసిన ఆమని.. 1997 తర్వాత కొన్నాళ్లు వెండితెరపై కనిపించలేదు.ఇండ‌స్ట్రీ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమె మళ్ళీ 2004లో మధ్యాహ్నం హత్య మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయక పాత్రలతో ప్రేక్షకుల‌ను మెప్పించింది. ఇప్పటికీ అడపా తడపా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్‌, టీవీ షోస్ లో కనిపిస్తూ అలరిస్తోంది.

allroudadda.

ఇక ఆమని పర్సనల్ లైఫ్ వస్తే.. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న స‌మ‌యంలోనే తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను ఆమ‌ని పెళ్ళి చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడితో పాటు ఒక కుమార్తె జ‌న్మించింది.ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. క్యాస్టింగ్ కౌచ్‌కు తానూ బలైనట్లు చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఫోటోలు చూసి ఆడిషన్లకు పిలిచేవారని, తీరా వెళ్లేసరికి ఈ అమ్మాయా అంటూ దీర్ఘాలు తీసేవారని చెప్పారు. తాను కలర్ తక్కువగా ఉండటం వల్ల చాలా సినిమాలు రిజక్ట్ అయినట్లు చెప్పారామె.

YS Jagan | వర్షాలకు రోడ్లు అన్నీ కొట్టుకుపోయాయి.. జగన్‌

కొందరైతే మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేసే వారని, ఇలాంటి సంఘటనలు తననెంతో బాధించాయని తెలిపారు. అయితే టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్ లో కా** స్టింగ్ కౌ)) చ్ ఎక్కువని అన్నారు. తాను తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా అవకాశం కోసం పిలిచినప్పుడు వెళ్లానని తెలిపారు.అక్కడకు వెళ్లాక.. తక్కువగా ఉండే దుస్తులు ధరించాలి, టూ పీసెస్ డ్రస్సులు వేసుకోవాలని చెప్పారని ఆమని తెలిపారు. అలాంటి దుస్తులు వేసుకున్న సమయంలో ఒంటిపై స్ట్రెచ్ మార్కులు ఉండకూడదని, మీకు ఉన్నాయా.. ఒకసారి దుస్తులు విప్పి చూపిస్తారా? అంటూ అడిగారంటూ పేర్కొన్నారు.

కొన్ని సినిమాలకు అడ్వాన్స్ కూడా తీసుకున్నప్పుడు.. మేనేజర్ వచ్చి డైరెక్టర్, ఫైనాన్సర్ మిమ్మల్ని ఒక సారి బీచ్ దగ్గరకు రమ్ముంటున్నారని.. అదీ కూడా ఒంటరిగా అని చెప్పేసరికి, దీంతో విషయం అర్థమై.. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసిన రోజులున్నాయన్నారు. ఏ రంగంలో అయినా మంచి, చెడులు ఉంటాయని, వాటిని ఎంపిక చేసుకోవడం మన చేతుల్లో ఉంటుందని అన్నారు. అయితే ఇటీవల పరిశ్రమలో వరుసగా హీరోయిన్లపై హీరోలు, విలన్లు మాటలు, చేష్టలు బయటకు వస్తున్న వేళ.. ఆమని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply