దిగ్గజ నటుడు శరత్ బాబు కన్నుమూత! కారణం ఇదే ..

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు నెల రోజులకు పైగా ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం నుండి ఆరోగ్యం మరింత క్షీణించింది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం తో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. 73 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1973 లో రామారాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు శరత్ బాబు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.

1951 జూలై 31 న శరత్ బాబు జన్మదినం. శరత్ బాబు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా అనేక పాత్రను పోషించిన శరత్ బాబు, దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు. శరత్ బాబుకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. మొదటి భార్య మాత్రం రమా ప్రభ. అందరికీ తెలిసిన తెలుగు నటి. 1974లో లేడీ కమెడియన్ రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు..

1988లో ఆమెతో విడిపోయారు. 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను పెళ్ళాడి 2011లో ఆమెకు కూడా డివోర్స్ ఇచ్చారు.రమాప్రభ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పదేళ్ల తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరు జంటగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. 1974లో రెండు కుటుంబాల అంగీకారంతో.. పెళ్లి వరకు వెళ్లింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన సంసారం.. తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు.

తన డబ్బు, సినిమాల్లో అవకాశాల కోసమే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు రమాప్రభ ఓ సందర్భంలో వ్యాఖ్యలు చేయటం విశేషం. విడాకుల తర్వాత శరత్ బాబు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. రమాప్రభ మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. వీరికి పిల్లలు లేరు. దీంతో రమాప్రభ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. పేరు విజయ చాముండేశ్వరి. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ భార్య ఈమె.

Leave a Reply