Jayaprada | జయప్రద కెరియర్ నాశనం అవ్వడానికి అతనే కారణమా?

Jayaprada

Jaya pradha | అందాల నటి జయప్రద గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం తో ఎంతోమంది ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన జయప్రద టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. జయప్రద కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సాంప్రదాయ పాత్రలతో, గ్లామర్ పాత్రలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అలరించింది.

తన నటనతో, అందచందాలతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరి మన్ననలు పొందిన జయప్రద రాజకీయాల లోకి వెళ్లడం వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జయప్రద తన రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. సినిమా కెరియర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదిగిన జయప్రద ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ గా, నిజాయితీగా ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు.

కానీ అలాంటి జయప్రద జీవితంలో ఒక తప్పు చేసింది.ఎన్ని సినిమాలు చేసిన ఆమె జీవితంలో నోరారా అమ్మ అని పిలిచే ఒక బిడ్డ లేదు అనే లోటు ఎప్పటికి తీరని వేదన. సినిమాల్లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న సమయంలో ఒక మొగ తోడు కావాలని ఎన్నో కళలు కంది. తండ్రి లేకుండా నానా కష్టాలు పడిన బాల్యం గురుతెరిగి తన జీవితం తల్లిలాగే అవ్వకూడదని ఎంతో మనోవేదన చెందేది.

Jayaprada
Jayaprada

టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రయాణం లో కోట్లకు అధిపతి బిలినియర్ అయినా శ్రీకాంత్ మెహతా సరదాగా జయ ప్రద తో మాట్లాడటం మొదలు పెట్టాడు.అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న శ్రీకాంత్ తన భార్య తో ఎంతో బాధలు అనుభవిస్తున్న అంటూ జయ ప్రద కు దగ్గర అయ్యాడు. తీరా పెళ్లి చేసుకున్నాక మొదటి భార్య నుండి వ్యతిరేఖత వచ్చింది. నలుగురిలో చాచి లెంపకాయ కొట్టింది కూడా. అన్ని పంటిబిగువున భరించింది. శ్రీకాంత్ మెహతా భార్య చేసిన గొడవలు అప్పట్లో పతాకశీర్షికలకు ఎక్కాయి.

చివరికి పెళ్లి చేసుకున్న పిల్లలను కనకూడదు అనే షరతు మీద పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేసింది శ్రీకాంత్ కి . ఈ విషయం తెలియాక అమ్మ అవ్వాలని జయ ప్రద ఎంతో ఆశ పడింది జయప్రద. ఇద్దరినీ కాపురం కూడా చేయనివ్వలేదు శ్రీకాంత్ మొదటి భార్య. అసలు విషయం తెలిసి అస్సలు తల్లి కానీ ఈ మొగుడు ఎందుకు అని అతడిని దూరం పెట్టేసింది. తన అక్క కొడుకుని పెంచి పెద్ద చేసింది. అతడిలోని అన్ని చూసుకొని జీవిస్తుంది. ఇలా పెళ్లి చేసుకొని పిల్లలని కనకుండా ఆమె పడ్డ బాధ అంతా ఇంతా కాదు.

Leave a Reply