Sr NTR | జ‌య‌హో ఎన్టీఆర్… 24 ఇడ్లీలు, 40 బజ్జీలు, రెండు లీటర్ల బాదం పాలు!

Sr NTR | ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎనలేని అభిమానం. అందుకే, నేటికీ ఎన్టీఆర్ ను తలచుకుని తెలుగు నెల పొంగిపోతుంది. నిజానికి.. ఎన్టీఆర్ పై ప్రజలు అంతగా అభిమానాన్ని పెంచుకోవడానికి కారణం.. ఆయన మహా నటుడు అని మాత్రమే కాదు, ఆయన మహా నాయకుడు అని కూడా. అవును, ఎన్టీఆర్ కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు మాత్రమే కాదు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు కూడా.

ఎన్టీఆర్ ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు కూడా. మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశ పటంలో తెలుగు వాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ కూడా. భవిష్యత్తు తరాలకి కూడా స్ఫూర్తినిచ్చే ఎన్టీఆర్ అంటే.. నేటికీ అందుకే అంత క్రేజ్.

అది పక్కన పెడితే సినిమాలకి, రాజకీయాలకి ఎంత ఆసక్తిని చూపేవారో…తన ఆహారపు అలవాట్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండేవారు. మన సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం…

Sr NTR
Sr NTR

ఆయన ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారట. ఆ తర్వాత టిఫిన్ లో భాగంగా చాలా పెద్ద సైజులో ఉండే రెండు డజన్ల ఇడ్లీలను తిని రెండు లీటర్ల పాలను తాగేవారట.ఒక్కోసారి షూటింగ్స్ వేరే ప్రాంతంలో ఉండడం వల్ల టిఫిన్ చేయడానికి కుదరకపోవడంతో ఇడ్లిలకి బదులుగా అన్నంని తినేవారట.

అన్నంతో తప్పకుండా నాటుకోడి మాంసం ఉండేలా చూసుకునేవాడట. ఇక సాయంత్రం పూట రెండు లీటర్ల బాదంపాలను తాగేవాడట. చెన్నైలో ఉన్న సమయంలో ఎక్కువగా బజ్జీలను తినడానికి ఇష్టపడేవాడట. ఏకంగా 40 బజ్జీలను లాగించేవారట. ఎలాంటి డైట్ లేకుండా కడుపునిండా తింటూ ఉండేవాడట మన సీనియర్ ఎన్టీఆర్.

Leave a Reply