Amrutha Pranay | మరో పెళ్లికి రెడీ అవుతున్న అమృత ప్రణయ్…అసలు విషయం ఇదే!

అమృత ప్రణయ్

అమృత ప్రణయ్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. పరువు హ*గా 2018 సమయంలో దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అమృత వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో ఆమె తండ్రి, బాబాయ్‌ తట్టుకోలేకపోయారు. అమృత భర్త అయిన పెరుమాళ్ల ప్రణయ్‌ను చం పి కూతుర్ని ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు. కూతురు కడుపుతో ఉందని చూడకుండా అల్లుడి మ() ర్డర్‌కు ప్లాన్‌ వేశారు.

అమృతకు చెకప్‌ చేయించటానికి ఆసుపత్రికి వెళ్లిన ప్రణయ్‌పై ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో దా డి చేయించారు. ఈ దాడిలో ప్రణయ్‌ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో అమృత తండ్రి జైలు పాలయ్యారు.బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన ఆయన ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవనంలో ఆ**త్య చేసుకుని మరణించారు. తండ్రి మరణం తర్వాత కూడా అమృత తన ఇంటికి వెళ్లలేదు.

ఇంకో పెళ్లి చేసుకోలేదు. తన బిడ్డను చూసుకుంటూ జీవితం గడుపుతోంది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి వీడియోలు చేస్తోంది. అయితే, అమృత మళ్లీ పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలింది. అమృతి రెడీ అవుతోంది తన పెళ్లి కోసం కాదని, తన బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి కోసమని తెలియవచ్చింది.

మూడు రోజుల క్రితం ఆమె తన అఫిషియల్‌ యూట్యూబ్‌ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ నా ఫ్రెండ్‌ ఎంగేజ్‌మెంట్‌కు నా హడావిడి’ అని రాసుకొచ్చింది. ఫ్రెండ్‌ పెళ్లి కోసం తాను ఎలా తయారు అవుతుందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. 18 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఆ వీడియోను పూర్తిగా చూడని, కింద ఆమె రాసిన దాన్ని పూర్తిగా చదవని వాళ్లు అమృత తన పెళ్లి కోసమే రెడీ అవుతోందని తమకు నచ్చింది ఊహించుకున్నారు. ఈ మేరకు తప్పుడు వార్తలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటం మొదలుపెట్టారు.మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply