Anchor Syamala | నా భర్త బలవంతం వల్లే దాంట్లోకి వెళ్ళాను..

allroudadda

Anchor Syamala | ప్రముఖ యాంకర్‌గా.. గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామల. ఆమె మాటల గారడితో ఇట్టే ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనూ అడపా దడపా నటిస్తోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామల కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఆపై సినిమాల్లో ట్రై చేసినా.. పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఈ సమయంలో బుల్లితెరపై యాంకర్‌గా మారి ఫుల్ సక్సెస్ అయ్యింది.

సినిమాల ప్రమోషన్ కోసం సుమ కాకుండా నెక్ట్స్ ఆప్షన్ ఎవరంటే… శ్యామల పేరే చెబుతున్నారు చాలామంది. అయితే శ్యామలకు పెళ్లైందా…? పిల్లలున్నారా అనేది చాలామందికి డౌట్. అబ్బాయిల హార్ట్ బ్రేక్ అయ్యే విషయం ఏంటంటే.. ఆమెకు ఎప్పుడో పెళ్లైయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రముఖ సీరియల్ యాక్టర్.. నరసింహారెడ్డి శ్యామల భర్త. ఈమె ప్రజంట్ తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే… ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తోంది.

allroudadda
allroudadda

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఆసక్తికర కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. ”ముఖ్యంగా నాకు యాంకర్ చేయాలనే ఆసక్తే లేదు. కానీ నా భర్త పదే పదే చెప్పి మరీ యాంకరింగ్‌లోకి తోశాడు. అలా యాంకరింగ్‌లోకి వచ్చిన నాకు కొంచెం కొంచెం దానిపై ప్రేమ పెరిగింది. ఆయన ఎక్కించిన ఆ డ్రగ్ వల్ల.. ఇప్పుడు యాంకరింగ్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చాను. నా భర్తే యాంకరింగ్ డ్రగ్ ఎక్కించాడు” అంటూ చెప్పుకొచ్చింది. డ్రగ్ అనే పదం వాడటంతో యాంకర్ శ్యామల కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే కొందరు థంబ్ నెయిల్స్ పెట్టి మరీ శ్యామల వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply