Manchu Manoj | ఆ రోజు రామ్ చరణ్ దేవుడి కంటే ఎక్కువ..మంచు మ‌నోజ్

allroudadda

Manchu Manoj | తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య విబేధాలు ఉన్నాయని అనేకమార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనేక సందర్భాలలో బాహాటంగానే ఈ విషయం కూడా స్పష్టమైంది. అయితే తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య వివాదంపై మరోమారు క్లారిటీ వచ్చింది.రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు రామ్ చరణ్ గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. చెర్రీ గురించి, రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించాడు.చిన్నప్పటి నుండి చరణ్‌కు ఓ మంచి గుణం ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే.. సాయం చేసే గుణం. అది నిజంగా ఈ రోజుల్లో ఎవ్వరికీ ఉండదు. ఎంత గొప్ప నటుడో.. గొప్ప మనిషి కూడా. నన్ను పిలవగానే ఈ రోజు ఇక్కడకు రావడానికి కారణం ఇదే. ఒక స్నేహితుడిగా నేను మాట్లాడటం నా బాధ్యత.

allroudadda
allroudadda

ఈ రోజుల్లో చాలా విలువైనది స్నేహం. మనిషి ఎదిగే కొద్దీ.. కొత్త పరిచయాలు చేసుకుని.. పాత వాళ్లను మర్చిపోతుంటారు. కానీ రామ్ చరణ్ అలా కాదు’ అని ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్.‘2018లో నేను అమెరికాలో ఉన్నప్పుడు దుబాయ్‌లో తెలుగు ఫ్యామిలీకి ఓ కష్టమొచ్చింది. అందులో చిన్న ఆడ పిల్ల కూడా ఉంది. వాళ్లకు ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లమ్ వచ్చి, సిగ్నేచర్లు పెట్టించుకుని, పాస్ పోర్టులు లాక్కొని, కుటుంబాన్నంతా లాక్ చేశారు. వాళ్లకు డబ్బు అవసరం వచ్చింది. నాకు ఫోన్లు వచ్చాయి.

Kumari Aunty | చదువు రాదు అయిన కోట్లు సంపాదించాను.. కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్..

నేను సాయం చేశాను. నా దగ్గర కూడా టైట్. ఇబ్బందుల్లో ఉన్నా. ఆ అర్థరాత్రి ఎవరికో చేయాలో తెలియక వెంటనే చరణ్‌కు ఫోన్ చేశాను. పరిస్థితి చెప్పాను. నా వంతు సాయం చేశాను. అర్జంటుగా ఐదు లక్షలు కావాలి. తక్కువయ్యాయి రా ..ఎలా చేయాలి మిత్రమా అని అడగ్గా.. అకౌంట్ నంబర్ పెట్టు బాబాయ్ అని నిమిషంలో పంపిచాడు. నిజంగా బాబాయ్ (చరణ్) ఆ పాప తల్లిదండ్రులు ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. నువ్వు చల్లగా ఉంటావ్. నీకే కష్టం రాకుండా.. ఇంకా వరల్డ్ వరల్డ్ వైడ్‌గా నంబర్ వన్ స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నా’ అని మనోజ్ చెప్పగానే విజిల్స్, కేకలతో దద్దరిల్లిపోయింది ఆడిటోరియం.

Leave a Reply